Balakrishna, Bobby: డైరెక్టర్ బాబీ బాలయ్యను అలా చూపించనున్నారా?

ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో వాల్తేరు వీరయ్య ఒకటి కాగా దర్శకుడు బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచింది. అయితే బాలయ్య బాబీ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. యంగ్ జనరేషన్ స్టార్ హీరోలంతా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో బాబీ బాలయ్యపై దృష్టి పెట్టారు.

రొటీన్ మాస్ మసాలా కథతోనే ఈ సినిమా తెరకెక్కనుందని బాలయ్య బాబీ పవర్ ఫుల్ రోల్ లో చూపించనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్యకు సైతం బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని బాబీ భావిస్తున్నారని తెలుస్తోంది. బాబీ కథకు బాలయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే మాత్రం ఈ కాంబోలో సినిమా పట్టాలెక్కే ఛాన్స్ అయితే ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైనే ఈ సినిమా తెరకెక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు.

బాబీ బాలయ్య కాంబినేషన్ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది. బాలయ్య ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తే మాత్రమే కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు వెలువడే ఛాన్స్ అయితే ఉంటుంది. బాలయ్య రెమ్యునరేషన్ 20 కోట్ల రూపాయల నుంచి 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా వరుస ప్రాజెక్ట్ లతో బాలయ్య కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

వీరసింహారెడ్డి మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుండగా హాట్ స్టార్ లో ఈ సినిమా రికార్డ్ స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంటోంది. వీరసింహారెడ్డి మూవీ 54 సెంటర్లలో 50 రోజుల పాటు ప్రదర్శించబడింది. ఓటీటీలో అందుబాటులోకి వచ్చినా ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. బాలయ్య వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు సాధిస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. బాలయ్య మల్టీస్టారర్ సినిమాలలో కూడా నటించాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus