Balakrishna,Mokshagna: ఆ ఒత్తిడి లేకుండా మోక్షజ్ఞను ఇండస్ట్రీకి తీసుకొస్తా.. బాలయ్య కామెంట్స్ వైరల్!

నందమూరి హీరో బాలయ్యకు కెరీర్ పరంగా వరుస విజయాలు దక్కుతున్నాయి. అన్ స్టాపబుల్ షో సీజన్1, అన్ స్టాపబుల్ షో సీజన్2 తో సక్సెస్ అయిన బాలయ్య బాక్సాఫీస్ వద్ద అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో సత్తా చాటారు. ఈ మూడు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయి. అయితే మోక్షజ్ఞ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి బాలయ్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మోక్షుతో తీయబోయే మొదటి సినిమా ఎవరితోనో నాకు తెలియదని ఆయన తెలిపారు. నేను మెంటల్ గా ఏం ప్రిపేర్ కానని ఆయన అన్నారు. రేపు షూటింగ్ అంటే ఇవాళ సినిమాకు సంబంధించిన కథ సిద్ధం అవుతుందని బాలయ్య కామెంట్లు చేశారు. మోక్షజ్ఞ భవిష్యత్తు గురించి నాకు దిగులు లేదని ఆయన చెప్పుకొచ్చారు. నా దగ్గరే బోలెడు కథలు ఉన్నాయని మొదటి సినిమా ఏది అవుతుందో నాకు తెలియదని ఆదిత్య 999 మ్యాక్స్ మొదటి సినిమా కావచ్చని లేదా రెండో సినిమా కావచ్చని బాలయ్య పేర్కొన్నారు.

రేపు షూట్ అంటే ఈరోజు మోక్షజ్ఞ కోసం కథ సిద్ధమవుతుందని నేను అంత స్పీడ్ గా ఉంటానని బాలయ్య తెలిపారు. నా స్పీడ్ ను ఎవరూ తట్టుకోలేరని బాలయ్య కామెంట్లు చేయడం గమనార్హం. ఎన్టీఆర్ మనవడు, బాలయ్య కొడుకు అనే భారం మోక్షజ్ఞపై ఉంటుందని ఆ ఒత్తిడి లేకుండా చేసి మోక్షజ్ఞను సినిమాల్లోకి తీసుకొస్తానని (Balakrishna) బాలయ్య తెలిపారు.

2024లో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉండవచ్చని బాలయ్య క్లారిటీ ఇచ్చేశారు. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో శ్రీలీల హీరోయిన్ అని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. మోక్షజ్ఞ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో సినీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.


భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus