Balakrishna: అభిమానుల కోసం అలాంటి రిస్క్ చేయడానికి సిద్ధమైన బాలయ్య!

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా యంగ్ హీరోలకు పోటీగా బాలకృష్ణ వరుస సినిమాలలో నటిస్తూ బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది వీర సింహారెడ్డి సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నటువంటి బాలకృష్ణ త్వరలోనే భగవంత్ కేసరి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకోబోతుందని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సన్ని వేషాలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించడం కోసం ప్రత్యేకంగా సెట్ వేసే ఆ సన్నివేశాలను పూర్తి చేశారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ తెలంగాణ యాసలో మాట్లాడుతూ చెబుతున్నటువంటి డైలాగ్స్ అందరిని ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో పాటలకు చాలా తక్కువ ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలోని ఓ పాటలో బాలయ్య (Balakrishna) చేత ఏకంగా అనిల్ రావిపూడి ఫ్లోర్ స్టెప్స్ చేయించాలని భావించారట .ఈ వయసులో ఇలాంటి స్టెప్స్ చేయడం అంటే కాస్త కష్టంతో కూడుకున్న పనే కానీ ఈ విషయం బాలకృష్ణకు చెప్పడంతో ఆయన ఏ మాత్రం ఆలోచించకుండా ఈ స్టెప్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

ఇలా ఈ ఫ్లోర్ స్టెప్స్ చేయడం కోసం బాలకృష్ణ దాదాపు పది రోజులపాటు రీహార్సల్స్ కూడా చేశారని తెలుస్తుంది. మరి బాలయ్య ఈ ఫ్లోర్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి అనే విషయం తెలియాలి అంటే ఈ సినిమా విడుదల అయ్యేవరకు వేచి చూడాల్సిందేనని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ తో పాటు శ్రీ లీలా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus