Balakrishna: వరుస సినిమాలు ఓకే చేసేస్తున్న నందమూరి అందగాడు!

కరోనా తొలి వేవ్‌ అయిపోయాక టాలీవుడ్ హీరోలు అందరూ వరుసగా సినిమా రిలీజ్‌ డేట్లు, కొత్త సినిమాల అనౌన్స్‌మెంట్లు చేసేశారు. ఒక్కొక్కరు రెండేసి, మూడేసి సినిమాలు లైన్‌లో పెట్టేశారు. ఇందులో సీనియర్‌ స్టార్‌ హీరోలు కూడా ఉన్నారు. అయితే అందులో కొత్త సినిమాలు ప్రకటించని హీరోల్లో నందమూరి బాలకృష్ణ పేరు ప్రముఖంగా వినిపించింది. ‘అఖండ’ తప్ప బాలయ్య చేతిలో సినిమాలేవీ లేవప్పుడు. అయితే ఇప్పుడు బాలయ్య ఫుల్‌ జోష్‌ మీదున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఆరు సినిమాలు బాలయ్య చేతిలో ఉన్నాయట. దీంతో అభిమానులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బి అవుతున్నారు.

బాలయ్య వరుస సినిమాలు చేస్తే అభిమానులకు ఆనందమే కదా. దాంతో పాటు పరిశ్రమకు కూడా ఆనందమే. ‘అఖండ’ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. పరిస్థితి కుదుటపడ్డాక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఇక మిగిలిన సినిమాలు సంగతి ఇలా ఉంది. ‘అఖండ’ త్వాత బాలయ్య గోపీచంద్‌ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆ తర్వాత అనిల్‌ రావిపూడి సినిమా ఉంటుందని టాక్‌. షైన్‌ క్రియేషన్స్‌ వాళ్లు నిర్మాతలట. దీంతోపాటు హారిక హాసిని క్రియేషన్స్‌లో బాలకృష్ణ ఓ సినిమా చేస్తారు.

దీనికి వెంకీ కుడుమల దర్శకత్వం వహిస్తాడని టాక్‌. దర్శకుడు శ్రీవాస్‌ ఇటీవల బాలయ్యకు ఓ కథ చెప్పారని, అందులో ఆయన కార్పొరేట్‌ రాజకీయం చేస్తారని వార్తొలొచ్చాయి. దీంతోపాటు ‘పైసా వసూల్‌’ తర్వాత బాలయ్య – పూరి జగన్నాథ్‌ కలసి ఓ సినిమా చేస్తారని అనుకున్నారు. అది త్వరలోనే ఉండొచ్చట. రచయిత ఎం.రత్నం కూడా బాలయ్యకు ఓ కథ చెప్పారని ఆ మధ్య అన్నారు. అదొక్కటి లైన్‌లో ఉంది. దీంతో ఐదు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఇది కాకుండా ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌గా ‘ఆదిత్య 999 మాక్స్‌’ రాబోతోంది. దానికి బాలయ్య దర్శకత్వం వహిస్తారు. సో ఆరు సినిమాలు లైన్‌లో ఉన్నాయన్నమాట.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus