స్టార్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ ఉండగా అనిల్ రావిపూడి సినిమాపై బాలయ్య ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సినిమాతో బాలయ్య ఖాతాలో హ్యాట్రిక్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తుండగా బాలయ్య సైతం ఈ సినిమా విషయంలో ఒకింత నమ్మకంతో ఉన్నారు. బాలయ్య ఒక్కో ప్రాజెక్ట్ కు 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా అనిల్ మూవీతో సక్సెస్ సాధిస్తే బాలయ్య పారితోషికం మరింత పెరగనుంది.
అయితే తాజాగా ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఒక పెళ్లి కొడుకు తన పెళ్లికి బాలయ్య కచ్చితంగా రావాలని బాలయ్య వస్తే మాత్రమే తాళిబొట్టు కడతానని మొండి పట్టు పట్టారు. విశాఖ జిల్లాలోని చింతల అగ్రారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలయ్యకు వీరాభిమాని అయిన పెద్దినాయుడు అనే వ్యక్తి సీనియర్ ఎన్టీఆర్ ను, బాలయ్యను ఎంతగానో అభిమానించారు. పెద్దినాయుడుకు పెళ్లి ఫిక్స్ కాగా సీనియర్ ఎన్టీఆర్, బాలయ్య ఫోటోలతో పెళ్లి పత్రికను పెద్దినాయుడు డిజైన్ చేయించారు.
మార్చి 11వ తేదీన ఈ అభిమాని పెళ్లి జరగనుండగా బాలయ్య ఈ పెళ్లికి హాజరయ్యేలా చూడాలని తనకు తెలిసిన వాళ్లను కోరుతున్నాడట. నందమూరి తారకరత్న మరణంతో ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ బాధలో ఉంది. ఇలాంటి సమయంలో బాలయ్య శుభకార్యాలకు హాజరు కావడానికి ఇష్టపడరు. ఏం జరుగుతుందో చూడాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.
సాధారణంగా బాలయ్య అభిమానులకు ఎంతగానో ప్రాధాన్యత ఇస్తారు. పెళ్లికి మరో మూడు వారాల సమయం ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. బాలయ్యకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. ఫేస్ బుక్ లో బాలయ్య యాక్టివ్ గా ఉంటున్నారు. త్వరలో బాలయ్య కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు. బాలయ్య తర్వాత మూవీ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కనుంది..
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?