Balakrishna: డైరెక్టర్ కంటే స్టోరీ రైటర్..కే ఎక్కువ ఎఫెక్ట్ పడిందిగా…!

‘టాలీవుడ్లో పెద్ద దర్శకులు, గతంలో తాము రాసుకున్న కొన్ని కథల్ని.. అందులోనూ పలు ప్రొడక్షన్ హౌసుల్లో చెప్పగా రిజెక్ట్ అయిన కథల్ని.. వేరే దర్శకులకి ఇచ్చేస్తున్నారు. అలా కొంత అమౌంట్ తీసుకొని లబ్ది పొందుతున్నారు’ అనే కామెంట్లు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ కథ ఇచ్చారు కదా అని కొంతమంది యంగ్ డైరెక్టర్స్ సంబరపడిపోయి హిట్టు కొట్టేశాం అనే ఫీలింగ్స్ లోకి వెళ్లిపోతున్నారు. ఇలాంటి వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) సినిమా గురించి చెప్పుకోవచ్చు.

Balakrishna

ఈ సినిమాకి దర్శకుడు అర్జున్ జంధ్యాల (Arun Jandyala) . ఇతను బోయపాటి శిష్యుడు. గతంలో ‘గుణ 369’ అనే సినిమా చేశాడు. అది బాక్సాఫీస్ వద్ద ఆడకపోయినా కథను బట్టి అతనికి మంచి పేరు వచ్చింది. అందుకే మహేష్ మేనల్లుడు అయిన గల్లా అశోక్ తో (Ashok Galla) ‘దేవకీ నందన వాసుదేవ’ చేసే అవకాశం లభించింది. దీనికి ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కథ అందించడంతో కొంతమంది దృష్టి ఈ సినిమా పై పడింది. దీనికి బాగా మార్కెట్ జరిగింది, బిజినెస్ జరిగింది ప్రశాంత్ వర్మ బ్రాండ్ ను చూసే అని చెప్పాలి.

అయితే సినిమా దారుణంగా ప్లాప్ అయ్యింది. కథ ఎంత బాగున్నా ఒక్కోసారి ట్రీట్మెంట్ కరెక్ట్ గా లేకపోతే ఫలితం తేడా కొడుతోంది. రిజల్ట్ సంగతి పక్కన పెట్టేస్తే.. ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమా విషయంలో డైరెక్టర్ కంటే కూడా ఎక్కువగా కథ అందించిన ప్రశాంత్ వర్మ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే ఇది రొటీన్ రొట్ట కొట్టుడు కథ కాబట్టి. హీరోయిన్ ట్విస్ట్ మినహా సినిమాలో ఆకర్షించే ఎలిమెంట్స్ లేవు.

పైగా ప్రశాంత్ వర్మ ఈ సినిమా ప్రమోషన్స్ కి వచ్చిన ‘చాలా వరకు నేనే చేశాను’ అన్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా చూశాక చాలా మంది ‘ప్రశాంత్ వర్మలో అంత విషయం లేదు’ ‘హనుమాన్ ఓ సింపతీ హిట్ సినిమా’ ‘వాట్ హప్పెండ్ టు మండే సినిమాకి ఇది కాపీ’ అంటూ కామెంట్లు చేశారు. మరోపక్క బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ (Nandamuri Mokshagnya) డెబ్యూ మూవీకి ప్రశాంత్ వర్మని దర్శకుడిగా ఎంపిక చేసుకున్నాడు.

దీంతో బాలయ్య (Balakrishna)  అభిమానులు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే బాలయ్య అభిమానుల సంఘం ప్రెసిడెంట్ తో సహా కొంతమంది వెళ్లి బాలయ్యని కలిసి వేరే దర్శకుడి చేతిలో పెట్టండి అంటూ రిక్వెస్ట్…లు పెట్టుకున్నారట. కానీ బాలయ్య తరఫున ఆయన కుమార్తె తేజస్విని..’స్క్రిప్ట్ బాగా వచ్చింది’ అని భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది.

అల్లు అర్జున్ పై పోలీస్ కంప్లైంట్.. ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus