Kichcha Sudeep: ‘కార్తీక దీపం’ బ్యూటీకి సుధీప్ వార్నింగ్!

శోభా శెట్టి (Shobha Shetty) అందరికీ సుపరిచితమే. ఈ కన్నడ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ‘కార్తీక దీపం’ సీరియల్ ద్వారా ఈమె బాగా పాపులర్ అయ్యింది అని చెప్పాలి. అందులో మోనిత పాత్ర చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆ పాత్ర లేకపోతే అన్నేళ్లు ఆ సీరియల్ టెలికాస్ట్ అయ్యేది కాదేమో..! అయితే ఆ సీరియల్లో ఆమె విలన్ రోల్ చేయడం వల్ల.. తర్వాత కూడా ఆమెకు విలన్ రోల్స్ వచ్చేవట. విలన్ ముద్రని తొలగించుకోవడానికి ఆమె ‘బిగ్ బాస్ 7’ లో అడుగుపెట్టినట్టు చెప్పుకొచ్చింది.

Kichcha Sudeep

పెద్దగా గేమ్ ఆడకపోయినా.. ఈమె హౌస్లో చాలా రోజులు కొనసాగింది. బయటకు వచ్చాక కూడా పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చి హైలెట్ అయ్యింది. ఇటీవల ఈమె కన్నడ బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టింది. అక్కడి లేటెస్ట్ సీజన్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వీటిలో శోభా శెట్టి హైలెట్ అవుతుంది. ఆమెకు సంబంధించిన లేటెస్ట్ వీడియోలో.. హోస్ట్ సుధీప్ (Kichcha Sudeep) వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.

ఈ వీడియోను గమనిస్తే.. శోభా శెట్టి ఏదో సంజాయిషీ చెప్పుకోవడానికి ట్రై చేస్తుంది. ఇంతలో సుధీప్ కలుగజేసుకుని.. ” ‘నువ్వు క్వశ్చన్న్ వేసుకోవడం.. దానికి మళ్ళీ నువ్వే ఆన్సర్ ఇచ్చుకోవడం’ వంటివి ఎక్కువగా కనిపిస్తుంది. అలా చేయడానికి ఇదేమైనా తెలుగు బిగ్ బాస్ అనుకున్నావా.? ఇది కన్నడ బిగ్ బాస్..! ఇక్కడ నేనే ప్రశ్నలు అడగాలి..! వాటికి సమాధానం నువ్వు చెప్పాలి” అంటూ మండిపడుతున్నాడు. మరి సుధీప్ (Kichcha Sudeep) ఆమెకు అంతలా క్లాస్ పీకేలా ఆమె ఏం చేసిందో ఏమో..!

ధనుష్ కు వడ్డీతో సహా చెల్లిస్తుందా.. నయన్ స్టన్నింగ్ కౌంటర్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus