బాలకృష్ణ ప్లాన్ కి షాక్ తిన్న ఎన్టీఆర్, చరణ్

నటసింహ నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి ఘన విజయం సాధించడంతో ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తన 101వ చిత్రాన్ని ప్రారంభించారు. సినిమా ముహూర్తము నాడే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. దసరా సందర్భం గా సెప్టెంబర్ 29న తమ చిత్రం విడుదలవుతుందని బాలకృష్ణ వెల్లడించారు. ఈ ప్రకటనతో బాలయ్య అభిమానులు సంబరాలు చేసుకుంటుంటే ఎన్టీఆర్, చరణ్ లు మాత్రం షాక్ తిన్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. సీనియర్ హీరో వల్ల యువ హీరోలు ఎందుకు షాక్ తిన్నారని విచారించగా అసలు విషయం బయట పడింది. ధృవ తర్వాత మెగా పవర్ స్టార్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈనెల 20న మొదలు పెట్టి, దసరాకు రిలీజ్ చేయాలనీ అనుకున్నారు.

అలాగే ఎన్టీఆర్ బాబీ డైరక్షన్లో సినిమా చేస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ ఫిల్మ్ ని చరణ్ కి పోటీగా దసరాకి రిలీజ్ చేయాలని నిర్మాత కళ్యాణ్ రామ్ భావించారు. వీరిద్దరూ రిలీజ్ డేట్ ప్రకటించక ముందే దసరా బరిలో తానున్నానంటూ బాలకృష్ణ ప్రకటించడంతో ఆ ఇద్దరు హీరోలు అవాక్కయ్యారు. చెర్రీ, తారక్ లు బాలయ్యతో పోటీకి దిగుతారా? పక్కకి తప్పుకుంటారా? అనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus