టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్2 కు బ్రేకులు పడుతుండటం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది. ఒక వారం ఎపిసోడ్ ప్రసారమవుతుంటే రెండు వారాల గ్యాప్ వస్తుండటంతో బాలయ్య అభిమానులు ఫీలవుతున్నారు. అయితే ఇకపై అభిమానులు ఈ విషయంలో ఫీల్ కాకుండా ఆహా నిర్వాహకులు, బాలయ్య జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రతి శుక్రవారం ఒక ఎపిసోడ్ కచ్చితంగా స్ట్రీమింగ్ అయ్యేలా ఆహా నిర్వాహకులు ప్లాన్ చేశారని సమాచారం.
అన్ స్టాపబుల్ సీజన్2 15 నుంచి 17 ఎపిసోడ్లు ప్రసారం కానున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అన్ స్టాపబుల్ సీజన్2 కొత్త ఎపిసోడ్ కు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, రాధికా శరత్ కుమార్ హాజరయ్యారు. గెస్ట్ ల సంఖ్యను పెంచడం ద్వారా షోపై ఆసక్తిని మరింత పెంచాలని ఈ షో నిర్వాహకులు భావిస్తున్నట్టు బోగట్టా. అటు రాజకీయ నాయకులను ఇటు సినీ ప్రముఖులను షోకు ఆహ్వానించడం ద్వారా
ఈ షో మరింత ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులను ఆకట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వీరసింహారెడ్డి సినిమాకు ఎక్కువ సంఖ్యలో డేట్స్ కేటాయించాల్సి ఉండటంతో ఇప్పటివరకు బాలయ్య షోకు బ్రేకులు పడుతున్నాయని సమాచారం అందుతోంది. వీరసింహారెడ్డి షూట్ దాదాపుగా పూర్తి కావడంతో బాలయ్య ఈ షోపై దృష్టి పెట్టనున్నారు.
త్వరలో ఈ షోకు సంబంధించి మరిన్ని ఆసక్తికర అప్ డేట్స్ రానున్నాయి. ఇతర భాషల ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఈ షోకు హాజరు కానున్నారు. ఒక ఎపిసోడ్ లో వీరసింహారెడ్డి చిత్రయూనిట్ ఈ షోలో పాల్గొనే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సీనియర్ హీరోలు కూడా ఈ షోకు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం అందుతోంది.