Balakrishna: బాలయ్య గోపీచంద్ మూవీ షూట్ అప్పుడేనా?

అఖండ సినిమాతో స్టార్ హీరో బాలకృష్ణ 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకున్నారు. అఖండ సక్సెస్ తో బాలయ్య మార్కెట్, రేంజ్ పెరిగింది. బాలయ్య తర్వాత సినిమా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో శృతి హాసన్ హీరోయిన్ గా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని వార్తలు వస్తుండగా షూటింగ్ డేట్ ఫిక్స్ అయిందని బోగట్టా.

తెలుస్తున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని బోగట్టా. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ పూర్తైన తర్వాత కడపలో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది దసరా టార్గెట్ గా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా ఆ సమయానికి ఈ సినిమా రిలీజవుతుందో లేదో చూడాలి.

గతేడాది ఉప్పెన సినిమా ఫిబ్రవరి 12వ తేదీన రిలీజ్ కాగా ఈ ఏడాది అదే తేదీన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు బాలయ్య సినిమా షూటింగ్ ను మొదలుపెట్టానున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. అఖండ తర్వాత బాలయ్య థమన్ కాంబోలో మరో మూవీ తెరకెక్కుతుండటం గమనార్హం. క్రాక్ సినిమాలో విలన్ రోల్ లో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

బాలయ్య ఈ సినిమాతో కూడా మరో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలయ్య కొత్త కథలు వింటున్నారని త్వరలో కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనలు వెలువడే ఛాన్స్ ఉందని సమాచారం. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus