ఎన్టీఆర్ బయోపిక్ లో నటించనున్న బాలయ్య మనవడు.!

మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ మూవీ గురించి రోజుకో న్యూస్ బయటికి వచ్చి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తున్న ఈ మూవీ కొన్ని రోజుల క్రితం రామకృష్ణ సినీ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ ప్రారంభమైంది. స్టార్ డైరక్టర్ తేజ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నిమ్మకూరులో సెకండ్ షెడ్యూల్ జరుపుకోనుంది. ఎన్‌బీకే ఫిలింస్‌ బ్యానర్‌పై బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే స్టార్స్ తో నిండిపోయింది. ఎన్టీఆర్ ఎదుగుదలను అడ్డుకోవాలని కుట్ర పన్నిన ఇందిరాగాంధీ రోల్ ని నదియా పోషిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు పాత్రలో పరేష్ రావెల్, చంద్రబాబునాయుడు పాత్రలో రానా కనిపించనున్నారు. మరికొంతమంది బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ ప్రాజక్ట్ లో భాగం కానున్నారు.

తాజాగా ఈ సినిమాలో ఇద్దరు బుల్లి స్టార్స్ నటించనున్నట్లు తెలిసింది. బాలకృష్ణ మనవడు దేవాన్ష్ (లోకేష్ కొడుకు) బాల బాలయ్యగా, కళ్యాణ్ రామ్ కొడుకు శౌర్య రామ్ బాల హరికృష్ణ గా కనిపించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్నీ చిత్ర బృందం త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. అలాగే నందమూరి కుటుంబానికి చెందిన చిన్నారులు ఈ సినిమాలో ఎన్టీఆర్ కొడుకులు, కూతుర్లుగా ఆకట్టుకోనున్నారు. ప్రముఖ కెమెరా మెన్ సంతోష్‌ తుండియిల్‌ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాని దసరాకు రిలీజ్ చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus