Balakrishna: 47 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ లు పెట్టింది ఆ ఇద్దరికేనట..!

దివంగత స్టార్ హీరో నందమూరి తారక రామారావు గారి కొడుకులు చాలా మంది సినీ పరిశ్రమలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కానీ.. తండ్రికి తగ్గ తనయుడిగా స్టార్ డంని సంపాదించుకున్నది మాత్రం బాలకృష్ణ అనే చెప్పాలి. బాలయ్య 100 శాతం డైరెక్టర్స్ హీరో వాళ్ళు ఏం చెబితే అది బ్లైండ్ గా ఫాలో అవుతారు. దాని వల్ల ఒక్కోసారి ఆయన వరుస ప్లాపులు ఎదుర్కొన్నారు అలాగే ఎక్కువ ఇండస్ట్రీ హిట్లు కూడా సాధించి నెంబర్ 1 హీరోగా ఎదిగారు.

అయితే సీనియర్ ఎన్టీఆర్ గారు హీరోయిన్లకు ఇచ్చే రెస్పెక్ట్ గురించి అప్పట్లో కథలు కథలుగా చెప్పుకునే వారు. అదే విధంగా ఒక్కసారి యాక్షన్ చెప్పగానే లవర్ బాయ్ లా రెచ్చిపోయేవారు. అయితే ఆన్ ది స్క్రీన్ సీనియర్ ఎన్టీఆర్ హీరోయిన్లకు లిప్ లాక్ పెట్టిన సందర్భాలు లేవు. అందుకు ఆయన ఒప్పుకునే వారు కూడా కాదు. తండ్రి బాటలోనే బాలయ్య కూడా లిప్ లాక్ సన్నివేశాలకు దూరంగా ఉండాలి అని భావించేవారు. అయితే ఆయన ఇద్దరు హీరోయిన్లతో లిప్ లాక్ చేయాల్సి వచ్చిందట.

ఇప్పట్లో అంటే కోట్లకు కోట్లు పారితోషికం అందుకుంటున్నారు కాబట్టి లిప్ లాక్ సన్నివేశాలకు హీరోయిన్లు ఒప్పుకుంటున్నారు. అప్పట్లో అయితే చాలా మంది హీరోయిన్లు వాటికి దూరంగా ఉండేవారు. కానీ సన్నివేశం లేదా పాట డిమాండ్ చేస్తే కొంతమంది హీరోయిన్లు డేర్ గా ముద్దు సన్నివేశాల్లో లేదా పాటలో నటించడానికి రెడీగా ఉండేవారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే బాలకృష్ణ లిప్ లాక్ పెట్టిన మొదటి హీరోయిన్ గా అప్పట్లో రజనీ నిలిచారు.

1987 లో వచ్చిన ‘రాము’ అనే సినిమాలో ఓ పాటలో భాగంగా బాలయ్య – రజినీ లు లిప్ లాక్ చేయాల్సి వచ్చింది. వై.నాగేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకుడు. ఇక బాలయ్య లిప్ లాక్ పెట్టిన మరో హీరోయిన్ ఇషా చావ్లా. 2012 లో వచ్చిన ‘శ్రీమన్నారాయణ’ సినిమాలో బాలయ్య- ఇషా చావ్లా ల మధ్య లిప్ లాక్ ఉంది. బాలయ్య 47 ఏళ్ళ సినీ కెరీర్లో ఆన్ ది స్క్రీన్ లిప్ లాక్ లు పెట్టింది ఈ ఇద్దరు హీరోయిన్లకే నట.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus