Balakrishna: బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న వ్యక్తికి ప్రాణం పోసిన బాలయ్య.. ఏం జరిగిందంటే..

‘నలుగుర్ని కొట్టినా మనమే.. పది మందికి పెట్టినా మనమే’ అనే డైలాగ్‌తో.. బాలయ్య వ్యక్తిత్వం ఎలాంటిదో ‘పైసా వసూల్’ మూవీలో ఒక్క ముక్కలో చెప్పారు డైరెక్టర్ పూరి జగన్నాథ్.. బాలయ్య భోళా శంకరుడు.. ముక్కుసూటి మనిషి.. ఆపద అంటే ఆదుకుంటాడు.. ఆయనకు కల్మషం తెలియదు.. పసి పిల్లాడి మనస్తత్వం అని కలిసి పని చేసిన వాళ్లు, దగ్గరి నుండి చూసిన వాళ్లు చెప్తుంటారు. సినీ రంగానికి చెందిన వారికి కానీ, పరిశ్రమకు కానీ పలు రకాలుగా సేవలందించారు బాలయ్య..

ఎమ్మెల్యేగా హిందూపూర్ నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారు. బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మంది క్యాన్సర్ బాధితులకు పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. పేద వారికి ఉచితంగా చికిత్సనందిస్తూ.. వారిలో మరణ భయాన్ని తొలగించి.. అది హాస్పిటల్ కాదు.. తమ పాలిట దేవాలయం అనేంతగా ఆయన సేవలందిస్తున్నారు. ఇక అక్కడ చిన్నారులకు స్వయంగా బాలయ్య ఎంతో ఆప్యాయంగా ఉంటారు.. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలందించిన బాలయ్య మరోసారి మంచి మనసు చాటుకున్నారు.

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధ పడుతున్న వ్యక్తికి ఉచితంగా వైద్యం చేయించి ప్రాణాలు కాపాడారు.. వివరాల్లోకి వెళ్తే.. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ బ్రెయిన్ ట్యూమర్ బారిన పడ్డాడు.. ట్యూమర్ తొలగించి మళ్లీ మామూలు మనిషి అవ్వాలంటే.. రూ. 40 లక్షలు ఖర్చవుతుందని ప్రైవేట్ హాస్పిటల్స్ వారు చెప్పారు.. అయితే డైరెక్టర్ బోయపాటి శ్రీను ద్వారా బాలయ్య బాబుకి ఈ విషయం తెలిసింది..

వెంటనే.. అతనికి ఉచితంగా చికిత్స చేయించారు.. తమ బసవ తారకం ఆసుపత్రిలో అతడిని జాయిన్ చేసుకుని.. మెరుగైన వైద్యమందించి మళ్లీ మామూలు మనిషిని చేశారు.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. సాధారణంగా చేసిన సాయం గురించి గొప్పలు చెప్పుకోవడం బాలయ్యకి అలవాటు లేదు.. ‘ఇదీ మా బాలయ్య మంచితనం’ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus