నందమూరి నట “సింహం” గర్జిస్తె ఆ శబ్దానికి బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది…
మన “లెజెండ్” తొడ గొడితే డీటీఎస్ సౌండ్ కే రిసౌండ్ వస్తుంది…
ఈ సమర సింహం కత్తి పడితే….రికార్డుల లెక్కలు ముక్కలై పోతాయి…
అతని రౌధ్రం భయానకంగా మారి, చూపులు చురకత్తులైతే కళామ తల్లి ముసి ముసి నవ్వులతో మురిసిపోతుంది…
ఫ్యాక్షన్ చిత్రాలకు యాక్షన్ నేర్పినా…జానపద చిత్రాలకు నేటి పదం చూపినా…పౌరాణికాలకు వెండి తెర అద్భుతంగా నిలిచినా అది బాలయ్యకే సొంతం.చరిత్ర పుటల్లో నుంచి, పుస్తకాల్లో నుంచి, పునాదుల్లో నుంచి, పునర్వైభవమ్ దిశగా మరో సారి పుట్టుకొస్తున్న మన ‘అద్భుత రాజధాని’ అమరావతి ప్రాంతాన్ని పాలించిన ‘యోధుడు’. శాతవాహనుల రాజుల్లో ముఖ్యుడు, ఎందరో వీరాధివీరుల్ని ఓడించి,మట్టు పెట్టి, రాజ్యానికి పూర్వవైభవం తెచ్చిన మహామహుడు అయినటువంటి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కధతో ముందుకొస్తున్నాడు మన నందమూరి నటసింహం. ప్రతిష్టాత్మకమైన తన 100వ చిత్రాన్ని దేవేంద్రుని ఘన రాజధాని, అశోకుని ఆకర్షించిన మహా రాజధాని, శాతవాహనుల ధర రాజధాని, చారిత్రక సంపాదకు, ఆధ్యాత్మిక సౌరభాలకు, రాచరికపు విశిష్టతకు ప్రతీకగా నిలిచిన అమరావతిని పాలించిన చక్రవర్తి ‘శాతకర్ణి’ కధతో తెరకెక్కించడం నిజంగా అద్భుతం, అజరామరం అనే చెప్పాలి. రాజుగా, యోధుడుగా, శత్రువుల్ని చీల్చి చెండాడే శాతకర్ణుడుగా బాలయ్య పాత్ర ఈ చిత్రానికి ఊపిరి పొయ్యనుంది. ఇక అలాంటి పాత్రల్లో బాలయ్య నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మరో పక్క ఈ చిత్రానికి కధ దర్శకత్వం వహిస్తున్నాడు మోస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్, న్యాషనల్ అవార్డ్ విన్నర్ క్రిష్. సహజంగా క్రిష్ సినిమాలన్నీ సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి.విలక్షణ పాత్రలతో, తనదైన శైలిలో, తన మదిలో మెదిలిన భావాలకు ప్రాణం పోసి తెలుగు తెరపై ఆవిష్కరించి విమర్శకుల ప్రశంసలు సైతం పొందుతున్న క్రిష్. గౌతమీపుత్ర శాతకర్ణి కధతో మరోసారి తెలుగు తెరకు సవాల్ విసురుతున్నాడు. ఓటమి ఎరుగని రారాజుగా శాతకర్ణి పాత్రలో క్రిష్ బాలయ్యను ఎలా చూపించబోతున్నాడో అంటూ ప్రతీ ఒక్కరూ బాలయ్య పాత్రపై ఆలోచనలో మునిగిపోయారు. ఇక గమ్యంతో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన క్రిష్ బాక్స్ ఆఫీస్ బోనంజా బాలయ్య బాబుతో…సంచలనాలు సృష్టించి రికార్డుల గమ్యాన్ని చేరాలని ఆశిద్దాం.