మాలో చాలామందికి బాలయ్య ఇన్స్ పిరేషన్ అని చెప్పిన మెగా హీరో
- January 12, 2017 / 11:28 AM ISTByFilmy Focus
తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి, మెగా హీరోల చిత్రాల మధ్య మంచి పోటీ ఉంటుంది. అది సినిమాలకే పరిమితమయినప్పటికీ నటుల మధ్య కూడా కోల్డ్ వార్ ఉంటుందని కొంతమంది నమ్ముతుంటారు. అటువంటిది ఏమిలేదని ఈ రోజు మరోమారు మెగా హీరోలు స్పష్టం చేశారు. నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమి పుత్రశాతకర్ణి నేడు రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ సందర్భంగా నందమూరి హీరోలతో పాటు మెగా హీరోలు బాలయ్యకు అల్ ది బెస్ట్ చెప్పారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “బెస్ట్ విషెస్ ఆఫ్ గౌతమి పుత్ర శాతకర్ణి” అంటూ ట్వీట్ చేశారు. ఇక మెగా హీరోల్లో ఒకరైన సాయి ధరమ్ తేజ్ వినూత్నంగా స్పందించారు.” శాతకర్ణికి అన్ని వైపులా నుంచి బాగుందనే టాక్ వస్తోంది. ఆ చిత్ర బృందానికి శుభాకాంక్షలు” అని చెప్పడమే కాకుండా “నందమూరి బాలకృష్ణ మాలో చాలా మందికి స్ఫూర్తి” అంటూ ట్వీట్ చేస్తూ బాలయ్యకు మెగా హీరోల్లో అభిమానులున్నారని స్పష్టం చేశారు. చిరు, బాలయ్య నటించిన ప్రతిష్టాత్మక చిత్రాలు విజయం సాధించడంతో ఈ సంక్రాంతి మెగా, నందమూరి హీరోలకే కాకుండా అభిమానులకు మంచి జ్జ్ఞాపకాన్ని అందించింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















