హమ్మయ్య… బాలయ్య ఇన్నాళ్ళకు క్లారిటీ ఇచ్చాడు..!

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కొడుకుతో పాటు మేనల్లుళ్ళు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. ఇక నాగార్జున తన ఇద్దరి కొడుకులను కూడా గ్రాండ్ గా లాక్ చేసాడు. వారు కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అయితే బాలయ్య మాత్రం తన కొడుకు మోక్షజ్ఞను ఇంకా లాంచ్ చెయ్యలేదు. మోక్షజ్ఞకు 25 ఏళ్ళ వయసొచ్చింది. బాలయ్య ఈ జూన్ 10 కి 60 ఏళ్ళు పూర్తిచేసుకోబోతున్నాడు. నాగచైతన్య, చరణ్, అఖిల్, వరుణ్ వంటి హీరోలు పాతికేళ్ళు నిండకుండానే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.

మరోపక్క పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కొడుకులు కూడా హీరోలుగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. కానీ బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎందుకు ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు అనే డౌట్ చాలా మందిలో ఉంది. బోయపాటి శ్రీను, క్రిష్ వంటి డైరెక్టర్లు మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేసే పనిలో ఉన్నారని వార్తలు వచ్చాయి. తరువాత మోక్షజ్ఞకు అసలు సినిమాల పై ఇంట్రెస్ట్ లేదు అంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ అప్పటి వరకూ ఈ విషయం పై స్పందించిన బాలయ్య.. ఇటీవల స్పందించి క్లారిటీ ఇచ్చాడు.

బాలయ్య మాట్లాడుతూ.. “మోక్షజ్ఞ‌ సినిమాల్లోకి రావడానికి చాలా ఇంట్రస్ట్‌గా చూపిస్తున్నాడు. డెఫనెట్‌గా సినిమాల్లోకి వస్తాడు. అతనికి వేరే దారిలేక అయితే కాదు.. సినిమాలంటే చాలా ఇంట్రస్ట్ ఉంది కాబట్టి వస్తాడు. తదాస్తు దేవతులు ఎప్పుడు ఆశీర్వదిస్తే అప్పుడే.. దీనికి ప్రత్యేకించి ప్లానింగ్ అంటూ ఏం లేదు.. మంచి మూడ్ ఉంటే తీసుకొచ్చి కెమెరా ముందు నిలబెట్టేయడమే’ అంటూ మోక్షజ్ఞ‌ ఎంట్రీ పై బాలయ్య క్లారిటీ ఇచ్చాడు.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus