NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఇటీవల దురదృష్టవశాత్తు గాయపడిన విషయం తెలిసిందే. గోపీచంద్‌ మలినేని సినిమా షూటింగ్‌ కాకినాడలో చేస్తుండగా గాయంతో మజిల్‌ టీర్‌ అయింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఆయన త్వరగా పూర్తి స్థాయిలో సిద్ధమై షూటింగ్‌కి రావాలని అందరూ కోలుకుంటున్నారు. అయితే దీనికి రెండు మూడు నెలల వరకు సమయం పట్టొచ్చని చెబుతున్నారు. దీంతో ఈ సినిమా అనుకున్నట్లుగా డిసెంబరులో రిలీజ్‌ అవుతుందా అనే చర్చ మొదలైంది.

NBK 111

అప్పుడు, కాదంటే కచ్చితంగా సంక్రాంతికే తీసుకురావడానికి బాలయ్య ప్లాన్‌ చేస్తున్నారు. అయితే 2027 సంక్రాంతికి ఇంకా ఆరు నెలలు ఉంది.. ఇప్పటివరకు అయితే ఆరు సినిమాలు సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. అసలు సమయం వచ్చేసరికి ఎన్ని సినిమాలు బరిలో నిలుస్తాయో తెలియదు. బాలయ్య కూడా పొంగల్‌ ఫైట్‌కి వస్తే వచ్చే ఏడాది సంక్రాంతి సినిమాలు అనేకంటే టాలీవుడ్‌ నాలుగు మూల స్తంభాల సినిమాలు అని చెప్పొచ్చు. ఎందుకంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌ సినిమాలు సంక్రాంతికి రెడీ అవుతున్నాయి.

చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్‌లో మెగా 158 సినిమా రూపొందుతోంది. ఇటీవల సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ సినిమాను ముగ్గుల పండక్కి తీసుకొస్తామని ఎప్పుడో చెప్పేశారు. ఇప్పుడు డిసెంబరు నుండి బాలయ్య జనవరికి వస్తారని టాక్‌. నాగార్జున్‌ తన వందో సినిమాను (కింగ్‌ 100) రా.కార్తిక్‌ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి దించే ఉద్దేశంలో ఉన్నారట కింగ్‌. వెంకటేశ్, కల్యాణ్ రామ్ కాంబోలో అనిల్‌ రావిపూడి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగానే రిలీజ్‌ చేస్తామని ఇప్పటికే చెప్పారు. అన్నట్లు ఈ సినిమాకు ‘జనవరి’ అనే పేరు వచ్చేలా టైటిల్‌ పెడతారట.

మరోవైపు సంక్రాంతి స్టార్‌ శర్వానంద్ కూడా ఓ సినిమాను తీసుకొస్తాడట. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆయన చేసే సినిమా ఆ పండక్కే అని ఇప్పటికే చెప్పారు. రవితేజ, శ్రీవిష్ణు కాంబినేషన్‌లో ప్లాన్‌ చేస్తున్న ‘వీరాధి వీరులంట’ సినిమాను సంక్రాంతికి తీసుకువద్దాం అని ప్లాన్‌ చేస్తున్నారట.

మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus