కృష్ణంరాజు ఫ్యామిలీని పరామర్శించిన బాలయ్య ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు సెప్టెంబర్ 11న అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే కృష్ణంరాజు గారు టాలీవుడ్ కు ఎంతో సేవ చేశారు. ఓ జర్నలిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టిన కృష్ణంరాజు గారు అటు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా చేశారు. అటు తర్వాత సొంత నిర్మాణ సంస్థను స్థాపించి హీరోగా సినిమాలు చేశారు. అవి సక్సెస్ అవ్వడంతో స్టార్ గా ఎదిగారు. ఆయన ఫెడవుట్ అవుతున్నారు అని తెలిసిన టైంలో మల్టీస్టారర్లలో నటించడం మొదలుపెట్టారు.

తర్వాత టాప్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించేవారు. కొన్నాళ్ల తర్వాత ప్రభాస్ ను హీరోగా పరిచయం చేశారు. అటు తర్వాత మా( మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) కు పెద్దమనిషి గా వ్యవహరించారు. ఇలా ఏదో ఒక విధంగా సినీ పరిశ్రమకు ఆయన దగ్గరగానే ఉంటూ వచ్చారు. ఇదిలా ఉండగా.. కృష్ణంరాజు మరణించిన టైంలో ఇండస్ట్రీ నుండి చాలా మంది ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. కానీ నందమూరి బాలకృష్ణ మాత్రం కొన్ని కారణాల వెళ్లలేకపోయారు.

అయితే తాజాగా ఆయన కృష్ణంరాజు గారి ఇంటికి సతీసమేతంగా వెళ్లి ఆయనకు నివాళులు అర్పించారు. అలాగే బాలకృష్ణ, వసుంధర ….. శ్యామలాదేవి గారితో కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ‘సుల్తాన్’ ‘వంశోద్ధారకుడు’ వంటి చిత్రాల్లో కృష్ణంరాజుతో కలిసి నటించారు బాలయ్య.

1

2

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus