Naga Babu: ఇన్‌స్టాగ్రామ్‌ను భలేగా వాడేస్తున్న మెగా బ్రదర్

నందమూరి బాలకృష్ణ, రామ్‌గోపాల్‌ వర్మ… నాగబాబు మధ్య ఏం జరుగుతోంది. ఏముంది… ఆ ఇద్దరిపై నాగబాబు ఆ మధ్య కాంట్రవర్శీ కామెంట్లు చేశారు. అంతకుముందు వారు కూడా ఏదో అన్నారని టాక్‌. ఇది ఎవరికైనా తెలుసు. కానీ ఇప్పుడు ఈ ముగ్గురి మధ్య సఖ్యత ఏర్పడిందా? ఈ మాట మేము అనడం లేదు. నాగబాబు ఓ ప్రశ్నకు చెప్పిన సమాధానం చూస్తే ఇదే అనిపిస్తోంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నాగబాబు అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తాజాగా మరోసారి ఆ ముచ్చట్లలో బాలకృష్ణ, ఆర్జీవీ ప్రస్తావన వచ్చింది.

ముచ్చట్లలో భాగంగా ఓ వ్యక్తి… ‘మీ వాట్సాప్‌ డీపీ ఏమిటి?’ అని నాగబాబును అడిగారు. దానికి స్పందించిన నాగబాబు… రామ్‌గోపాల్‌వర్మ, బాలకృష్ణ కలసి దిగిన ఓ ఫొటోని షేర్‌ చేశారు. ఆ ఫొటో చూసిన కొంతమంది అభిమానులు ఒక్కసారి షాక్‌ అవ్వగా, ఇంకొందరు నాగబాబు వ్యంగ్యంగా ఈ ఫొటో పెట్టి ఉంటారని అంటున్నారు. దీనికి సమాధానం ఇవ్వాల్సింది నాగబాబునే. ఆయన మళ్లీ ఇన్‌స్టా ముచ్చట్లు పెడితే ఈ విషయం మీద స్పందిస్తారేమో చూడాలి.

నాగబాబు మామూలుగా ఈ ఫొటో షేర్‌ చేసుంటే ఒకలా ఉండేది. కానీ బాలకృష్ణ, ఆర్జీవిని తరచుగా విమర్శించే నాగబాబు ఈ పోస్టు చేయడం ఆసక్తి రేకెత్తించింది. గతంలో కొన్ని సందర్భాల్లో నాగబాబు వీరిద్దరిపై తన విమర్శలు, పంచ్‌లతో విరుచుకుపడ్డారు. ఆ సమయంలో వారి నుండి కూడా సమాధానాలు వచ్చాయి. ఆ తర్వాత పరిస్థితి అంతా సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో ఇలా జరగడం గమనార్హం.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus