హైదరాబాద్ లో బాలయ్య మూవీ ప్రారంభం!
- March 6, 2017 / 12:06 PM ISTByFilmy Focus
అత్యంత వేగంగా సినిమాలు తీయగల డైరక్టర్ పూరి జగన్నాథ్, ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ వంటి చారిత్రక సినిమాని సైతం తక్కువరోజుల్లో పూర్తి చేసిన హీరో బాలకృష్ణ. వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా రాకెట్ వేగంతో కంప్లీట్ కావడం తథ్యం. అందుకే పూరి కొన్ని రోజుల క్రితం భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ బాలకృష్ణ 101 వ సినిమాని నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఈ ఫిల్మ్ మార్చి 9న పూజా కార్యక్రమాలు జరుపుకొని వెంటనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుందని, సెప్టెంబర్ 29న రిలీజ్ కానుందని వెల్లడించారు. ఈ సినిమాకి అంత సెట్ అయినట్లు సమాచారం.
గురువారం తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అవుతుంది. తొలుత బాలయ్యపై యాక్షన్ సీన్ చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత ఇంగ్లాండ్ కి వెళ్లనుంది. అక్కడ కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఇంగ్లాండ్ షెడ్యూల్ ఏప్రిల్ 7 నుంచి మే 7వరకూ కొనసాగనుంది. మార్చి 9న సినిమాలో నటిస్తున్న నటీనటులు, పనిచేస్తున్న టెక్నీషియన్ల పేర్లు అధికారికంగా వెల్లడించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















