నందమూరి నటసింహం బాలకృష్ణ ఒకప్పుడు కేవలం వెండితెర సినిమాలలో మాత్రమే నటిస్తూ వెండితెరకు మాత్రమే పరిమితం అయ్యారు. కానీ ఈ మధ్యకాలంలో బాలయ్య కూడా తన రూట్ మార్చారని తెలుస్తోంది. బాలకృష్ణ ప్రస్తుతం పలు టాక్ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది. అదే విధంగా పలు కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తూ కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమం తర్వాత ఈయన వేగ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ సమస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. అలాగే ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. పటాన్ చెరువులో ఉన్నటువంటి ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బాలయ్య హాజరు కాబోతున్నారని
ఇందుకు సంబంధించిన ఫోటోషూట్ కోసం ఈయన కేవలం రెండు రోజులు కాల్ షీట్స్ మాత్రమే ఇచ్చారని తెలుస్తుంది. అయితే ఈ షాపింగ్ మాల్ ప్రారంభించడం కోసం బాలకృష్ణ ఏకంగా మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు అవుతున్నాయి.
ఇలా హైదరాబాదులో ఒక బ్రాండ్ ప్రమోషన్ కోసం బాలకృష్ణ (Balakrishna) ఏకంగా మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు ఇక బాలయ్య తన సినిమాలకు కూడా ఇప్పుడు 25 కోట్ల మేర మాత్రమే రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఈయన బాబి డైరెక్షన్ లోని సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.