Narasimha Naidu: బి.గోపాల్ అలా చెబితే బాలయ్య రియాక్షన్ ఇదే.. చూస్తారుగా అన్నానంటూ?

స్టార్ హీరో బాలకృష్ణ సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో నరసింహ నాయుడు మూవీ ఒకటి. బి.గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఒక ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ నాతో పని చేసిన తర్వాత శ్రీహరి హీరో అయ్యాడని శ్రీహరి చాలామందితో బాలయ్య దృష్టిలో పడితే మాత్రం మీకు అదృష్టం కలిసొచ్చినట్టేనని చెప్పారని ఆయన పేర్కొన్నారు.

సినిమాల్లో సక్సెస్ కావాలంటే ఫిజిక్, టాలెంట్ రెండూ ఉండాలని ఫిజిక్ ఉన్నోడికి జనరల్ గా టాలెంట్ ఉండదని బాలయ్య తెలిపారు. ఫిజిక్ ఉన్నోడికి మెదడు మోకాలిలో ఉంటుందని అంటారని ఆయన కామెంట్లు చేశారు. శ్రీహరికి మాత్రం ఫిజిక్ ఉండేదని టాలెంట్ కూడా ఉండేదని బాలయ్య పేర్కొన్నారు. నరసింహ నాయుడు మూవీ షూట్ సింహాచలంలో జరిగిందని ఆయన కామెంట్లు చేశారు. ఆ సినిమాలో ఫైట్ సీన్ కోసం లోకల్ గా జిమ్ చేసేవాళ్లను పిలిచామని వాళ్లంతా సంతోషంగా సినిమాలో నటించడానికి వచ్చారని బాలయ్య చెప్పుకొచ్చారు.

గోపాల్ గారు మెడ దగ్గర వేలు పెట్టుకున్నారంటే ఏదో డౌట్ అని అర్థం చేసుకోవాలని నేను ఏంటండీ అని అడగగా విలన్లు చాలా భారీగా ఉన్నారని వాళ్లను పంపించేద్దాం అని బి.గోపాల్ అన్నారని బాలయ్య కామెంట్లు చేశారు. మీరు వాళ్ల పక్కన ఆనరు అని బి.గోపాల్ కామెంట్లు చేశారని బాలయ్య పేర్కొన్నారు. నేను వెంటనే వాళ్లను పిలిపించామని వాళ్లను అగౌరవపరచడం ఏ మాత్రం కరెక్ట్ కాదని బి.గోపాల్ తో చెప్పానని ఆయన అన్నారు.

మీకంటే పొడవుగా ధిట్టంగా ఉన్నారని బి.గోపాల్ చెప్పగా నాకు వదిలేయండి అని నేను చెప్పానని బాలయ్య చెప్పుకొచ్చారు. ఆ ఫైట్ సీన్ లో నేను కెమెరా వైపు నడుస్తుంటే జనం సైతం భయపడ్డారని ఆయన తెలిపారు. చూస్తారుగా స్క్రీన్ పైన అని బి.గోపాల్ కు చెప్పానని నా మాటే నిజమైందని బాలయ్య అన్నారు. నరసింహ నాయుడు (Narasimha Naidu) మూవీలో గుడి ముందు తీసిన ఫైట్ సీన్ గురించి బాలయ్య ఈ కామెంట్లు చేశారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus