అఖండ మరియు ‘వీర సింహా రెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత మంచి జోష్ మీద ఉన్న బాలయ్య బాబు, ఇప్పుడు అనిల్ రావిపూడి తో ‘భగవంత్ కేసరి ‘ చిత్రం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. బాలయ్య బాబు ని ఇలా పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ లో చూసి చాలా కాలం అయ్యింది.
ఆయన సినిమాలు ఎప్పుడూ ఊర మాస్ గా ఉండడమే ఇది వరకు చూసాము. కానీ ట్రైలర్ చూస్తూ ఉంటే బాలయ్య మార్కు మాస్ ఉంటూనే, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. విడుదల దగ్గర పడుతున్న నేపథ్యం లో ఈ చిత్రానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసాడు. ఈ ప్రెస్ మీట్ లో బాలయ్య బాబు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.
ఒక పక్క రాజకీయాల్లో బిజీ గా ఉంటూనే మరోపక్క (Balakrishna) బాలయ్య బాబు సినిమాలు కూడా చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన పై మాజీ మంత్రి కొడాలి నాని, విగ్గు గురించి వ్యంగ్యాస్త్రాలతో కొన్ని కామెంట్స్ చేసాడు. దీనికి బాలయ్య బాబు రియాక్షన్ ఇస్తూ ‘ ఈమధ్యనే ఎవడో నా విగ్గు మీద కామెంట్ చేసాడు. అవును నేను విగ్ పెట్టుకుంటా నీకొచ్చిన నష్టం ఏమిటి, నీ గెడ్డం ఎమన్నా పీక్కుంటావా, నాది మొత్తం ఓపెన్ మైండ్, తెరిచినా పుస్తకం లాంటి వాడిని.
ఈ కామెంట్స్ చూసినోడికి చెప్తున్నా, మళ్ళీ పిచ్చి పిచ్చిగా వాగుడు వాగితే పగులుద్ది’ అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారింది. బాలయ్య ఇలా మాట్లాడేసరికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాలను తొక్కినట్టు ‘భగవంత్ కేసరి’ చిత్రాన్ని కూడా తొక్కుతుందేమో అని అభిమానులు కంగారు పడుతున్నారు.