అదీ బాలయ్య అంటే
- May 17, 2016 / 01:30 PM ISTByFilmy Focus
నట సింహా నందమూరి బాలకృష్ణ వందో చిత్రం “గౌతమి పుత్ర శాతకర్ణి”. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొరాకో లో జరుగుతూ ఉంది. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యం లో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
తెల్లవారు జాము వేళల్లో అక్కడ వాతావరణం బాగా ఉండడంతో ఆ వేళలో షూటింగ్ చేస్తున్నారు. ఈ సీక్వెన్స్ బాగా రావాలని బాలకృష్ణ చాలా కష్టపడుతున్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అంతే కాదు అందరికంటే ముందు బాలకృష్ణ షూటింగ్ స్పాట్ కి వచ్చి మేకప్ వేసుకుని రెడీ గా ఉన్నాడట. ఆయన డె డికేషన్ చూసి యూనిట్లు సభ్యులు షాక్ అవుతున్నట్లు సమాచారం.
ఈ సినిమా చిత్రీకరణ మొరాకో లో రెండు వారాల పాటు సాగుతుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















