Mokshagna: ఈ ఏడాదే మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారట.. కానీ?

  • January 24, 2024 / 04:22 PM IST

నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే భారీ సక్సెస్ లు సాధిస్తారని తండ్రి తగ్గ తనయుడు అనిపించుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే మోక్షజ్ఞ ప్రస్తుతం ఎంతోమందికి నటనలో శిక్షణ ఇచ్చిన వాళ్లను స్టార్ హీరోలను చేసిన సత్యానంద్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. పవన్, మహేష్, ప్రభాస్ సత్యానంద్ దగ్గరే శిక్షణ తీసుకుని ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్ తో తెరకెక్కనుండగా ఈ సినిమా షూట్ ఎప్పుడు మొదలవుతుంది? ఈ సినిమాకు నిర్మాతలు ఎవరు? ఈ సినిమా బడ్జెట్ ఎంత? అనే ప్రశ్నలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. మోక్షజ్ఞ రేంజ్ అంతకంతకూ పెరగాలని కెరీర్ పరంగా భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ చెబుతున్నారు. మోక్షజ్ఞ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

బాలయ్య సినిమాలు, పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది సెకండాఫ్ లో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉండే ఛాన్స్ అయితే ఉంది. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ బాలయ్య, మోక్షజ్ఞ కాంబినేషన్ లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. మోక్షజ్ఞ ఫస్ట్ సినిమానే పాన్ ఇండియా మూవీగా ఉండే ఛాన్స్ అయితే ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ సులువుగానే కెరీర్ పరంగా సక్సెస్ సాధిస్తారని ఫ్యాన్స్ చెబుతున్నారు.

బాలయ్య మోక్షజ్ఞ (Mokshagna) జాతకం ఆధారంగా సినిమాల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. మోక్షజ్ఞ ఇంటర్వ్యూలు ఇస్తే సినీ కెరీర్ కు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవాకాశాలు ఉంటాయి. ఐదేళ్ల నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి వార్తలు వస్తున్నాయి. యాక్టింగ్ లో శిక్షణ పూర్తైన తర్వాత మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ షూట్ మొదలయ్యే ఛాన్స్ అయితే ఉంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus