Balakrishna: సిస్టర్‌ సెంటిమెంట్‌తో బాలయ్య రాబోతున్నాడా?

‘ఏదీ ఒకసారి మావయ్యా అని పిలవమ్మా?’ ఈ డైలాగ్‌ ఎంత ఫేమస్‌ అయ్యిందో అందరికీ తెలుసు. చాలామంది దీన్ని జోక్‌ చేసేశారు కానీ. ఆ డైలాగ్‌లో ఉన్న ఆర్థ్రత, ఎఫెక్షన్‌ మామూలుగా ఉండదు. బాలయ్య తనదైన శైలిలో ప్రేమను కురిపించిన సన్నివేశమది. ఇప్పుడు మరోసారి బాలయ్య ‘మావయ్యా?’ అని పిలిపించుకోబోతున్నాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న #NBK107 గురించి ఈ చర్చ అంతా. ఆ సినిమాలో బాలయ్య పాత్ర అన్న అని టాక్‌.

#NBK107లో బాలయ్యకు చెల్లెలిగా వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ నటిస్తోందని చెబుతున్నారు. వరు ఆ సినిమాలో నటిస్తోంది అనే విషయం పాతదే. గతంలో చాలా సందర్భాల్లో ఈ విషయం మనం చెప్పుకున్నాం. అయితే చెల్లెలిగా నటిస్తుంది అనేది మాత్రం కొత్త విషయం. చెల్లి, మేన కోడలు సెంటిమెంట్‌ను ముందు పెట్టి ఫుల్‌ మాస్‌ మసాలా కమర్షియల్‌ కథను గోపీచంద్‌ మలినేని రాసుకున్నారని ఓ టాక్‌ నడుస్తోంది. ఇటీవల ఆ సన్నివేశాలు తెరకెక్కించారని టాక్‌.

బాల‌కృష్ణ చేసిన సిస్ట‌ర్ సెంటిమెంట్ సినిమా అంటే ఠక్కున గుర్తొచ్చేది ‘ముద్దుల మావ‌య్య‌’. అందులో అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆ సినిమా తర్వాత బాలయ్య నుండి ఆ స్థాయి సిస్టర్‌ సెంటిమెంట్‌ సినిమా రాలేదనే చెప్పాలి. ఇప్పుడు గోపీచంద్ మలినేని సినిమాతో ఆ ముచ్చట తీరిపోతుంది అంటున్నారు. ఈ సినిమాను పూర్తి స్థాయి యాక్ష‌న్ సినిమా అనుకోవద్దని, సిస్ట‌ర్ సెంటిమెంట్ పుష్క‌లంగా ఉందని సినిమా బృందం సన్నిహితులు చెబుతున్నారు.

బాల‌య్య, వ‌ర‌ల‌క్ష్మి మ‌ధ్య బ‌ల‌మైన స‌న్నివేశాలు రాసుకున్నారట ద‌ర్శ‌కుడు. వెండితెర మీద వాటిని చూసి వావ్‌ అంటారని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే విజయదశమికి ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది. అప్పుడు ఈ విషయంలో ఫుల్‌ క్లారిటీ వచ్చేస్తుంది. లేదంటే అంతకుముందే ఏ పాటో, పోస్టర్‌ రిలీజ్‌ చేసి సర్‌ప్రైజ్‌ అయినా చేసే అవకాశంఉంది. దసరాకు ఈ సినిమా వస్తే చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’తో ఢీ అని మీకు తెలిసే ఉంటుంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus