నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం తన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’తో (Daaku Maharaaj) సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ పట్ల వచ్చిన అద్భుత స్పందన ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. బాబీ కొల్లి (Bobby) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బాలయ్య డిఫరెంట్ అవతార్‌లో కనిపించనున్నారు. బాలయ్య హ్యాట్రిక్ హిట్ల తరువాత వస్తున్న ఈ సినిమా, మరింత బలమైన ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. బాలయ్య గత చిత్రాలను చూస్తే, ఆయన బాక్సాఫీస్ ఓపెనింగ్స్ విషయంలో సాలిడ్ రికార్డులను నెలకొల్పారు.
‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) సినిమా మొదటి రోజే ఏకంగా 25.35 కోట్ల షేర్ కలెక్ట్ చేసి, బాలయ్య కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది. ఈ తర్వాత ‘అఖండ’ (Akhanda) 15.39 కోట్ల షేర్‌తో రెండో స్థానంలో నిలిచింది. అలాగే ‘భగవంత్ కేసరి’ (Bhagavath Kesari) కూడా మంచి రికార్డును నమోదు చేసి మొదటి రోజు 14.36 కోట్ల షేర్‌ను అందుకుంది. అయితే, బాలయ్య గత కొంత కాలంగా కేవలం మాస్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకర్షిస్తున్నాడు.
ఇది ఆయన సినిమాల ఓపెనింగ్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ‘డాకు మహారాజ్’కి కూడా అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు జరిగిన భారీ థియేట్రికల్ బిజినెస్ ఈ సినిమా మీద భరోసాను పెంచుతోంది. ప్రస్తుత రికార్డులను పరిగణనలోకి తీసుకుంటే, బాలయ్య మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ‘వీరసింహారెడ్డి’ టాప్‌లో ఉంది.
‘డాకు మహారాజ్’ ఈ రికార్డును అధిగమించగలదా? అన్నది ఆసక్తికర ప్రశ్న. సంక్రాంతి సీజన్‌లో పెద్ద సినిమాల పోటీ ఉన్నప్పటికీ, బాలయ్యకు ఉన్న ఫాలోయింగ్, థియేటర్లలో వచ్చే పాజిటివ్ రెస్పాన్స్‌తో ఈ చిత్రం వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేసే అవకాశం ఉంది.