తారకరత్న పిల్లలతో బాలయ్య.. వైరల్ అవుతున్న ఫోటో..!

నందమూరి తారకరత్న మరణంతో నందమూరి – నారా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.. గత 23 రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారక రత్న.. ఫిబ్రవరి 18న కన్నుమూశారు.. కోలుకుని, కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం తిరిగి వస్తారనుకున్న కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ వర్గాల వారు భావించారు.. వారి ప్రార్థనలు ఫలించలేదు.. 39 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు..

తారక రత్న – అలేఖ్య రెడ్డి దంపతులకు ముగ్గురు పిల్లలు.. మొదట కుమార్తె, తర్వాత కవలలు (పాప – బాబు) పుట్టారు.. తాత ఎన్టీ రామారావు పేరు వచ్చేలా ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టుకుని తాత గారి మీద ప్రేమను చాటకున్నారు తారక రత్న.. పెద్ద పాప పేరు నిషిక (N), తనయుడు తనయ్ రామ్ (T), రెండో పాప పేరు రేయా (R).. ఇలా NTR అనే అర్థం వచ్చేలా తమ చిన్నారులకు పేర్లు పెట్టుకున్నారు..

పిల్లలు ముగ్గురు తాత బాలయ్యతో కలిసి ఉన్న పాత ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.. ఆ ఫోటో చూసి అభిమానులు, పార్టీ వర్గాల వారు, సినీ పరిశ్రమ వారు భావోద్వేగానికి గురవుతున్నారు..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus