రోజుకి 14 గంటల పాటు బాలయ్య షూటింగ్
- May 25, 2016 / 10:13 AM ISTByFilmy Focus
లయన్ నందమూరి బాలకృష్ణ వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. మొన్నటి వరకు మొరాకోలో షూటింగ్ జరుపుకొని చిత్ర బృందం సోమవారం హైదరాబాద్ కి చేరుకుంది. ఈ సందర్భంగా సినిమా దర్శకుడు క్రిష్ షూటింగ్ సంగతులను మీడియాతో పంచుకున్నారు.
“బాలకృష్ణ, హిందీ నటుడు కబీర్ బేడి ల మధ్య కీలక మైన యుద్ధ సన్నివేశాలను చిత్రీకరీంచాము. ఈ సీన్ షూటింగ్లో వెయ్యిమంది ఆర్టిస్టులతో పాటు 200 ఒంటెలు, గుర్రాలు పాల్గొన్నాయి. ముఖ్యంగా బాలయ్య గురించి చెప్పుకోవాలి. మొరాకోలో షూటింగ్ జరిగినన్నిరోజులు ఆయన రోజుకు 14 గంటల పాటు పనిచేసారు. షూటింగ్ మొదలు నుంచి చివరి వరకు అదే ఎనర్జీని కొనసాగించారు. ఆయన మా అందరికి స్ఫూర్తి కలిగించారు. మాలో ఉత్సాహాన్నినింపారు” అని క్రిష్ చెప్పారు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















