Balakrishna: ఈ నటి నటనకు బాలయ్య సైతం చప్పట్లు కొట్టారట!

టాలీవుడ్ ప్రముఖ నటీమణులలో ఒకరైన వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలకు, సినిమాల్లోని కీలక పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఈ నటి సినీ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. క్రాక్ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడం ఈ నటి సినీ కెరీర్ కు చాలా ప్లస్ అయింది. టాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలలో కనిపిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.

వీరసింహారెడ్డి సినిమాలో హీరో చెల్లి పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో 5 పేజీల డైలాగ్ చెప్పాల్సి ఉందని ఈ డైలాగ్ ను సింగిల్ టేక్ లో వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పడంతో అందరూ షాకయ్యారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్ లో వరలక్ష్మీ అద్భుతంగా నటించడంతో పాటు బాలయ్యను సైతం మెప్పించారని సమాచారం.

సీన్ పూర్తైన తర్వాత బాలయ్య కూడా చప్పట్లు కొట్టారంటే సీన్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో సులువుగానే అర్థమవుతుంది. 2023 సంక్రాంతి పండుగ కానుకగా వీరసింహారెడ్డి మూవీ రిలీజ్ కానుండగా ట్రైలర్ తో పాటు రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. జనవరి 12వ తేదీన ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల మధ్య గ్యాప్ ఉండనుందని బోగట్టా.

సంక్రాంతి పండుగ కానుకగా ఏజెంట్, వారసుడు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. నాలుగు సినిమాలకు థియేటర్లను కేటాయించడం సులువు కాకపోయినా సంక్రాంతి సీజన్ ను వదులుకోవడానికి టాలీవుడ్ స్టార్స్ ఇష్టపడటం లేదు. 2023 సంక్రాంతి కానుకగా విడుదలై హిట్ టాక్ వచ్చిన సినిమాలకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు రావడం గ్యారంటీ అని చెప్పవచ్చు.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus