నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని అందరికీ సుపరిచితమే. ఈమె గురించి కొన్నాళ్లుగా ఎక్కువ చర్చే జరుగుతుంది. నిజజీవితంలో అందరినీ భయపెట్టే బాలకృష్ణ… చిన్న కూతురు దగ్గర మాత్రం పిల్లి అయిపోతాడు. ఆమె చెప్పిన మాటని ధాటి ఏమీ చేయడు అని తేజస్విని గురించి చాలా మంది చెబుతూ ఉంటారు. బాలకృష్ణ ఒకానొక టైంలో ఫేడౌట్ అయిపోయే స్థితిలో ఉన్నప్పుడు.. తేజస్విని ప్లానింగ్ మొత్తం మార్చి.. మళ్ళీ ఆయన ఫామ్లోకి వచ్చేలా చేసింది అని కూడా ఇండస్ట్రీలో చాలా మంది చెప్పుకొచ్చారు.
బాలయ్య ఇమేజ్ కి తగ్గ కథల్ని, దర్శకుల్ని దగ్గరుండి ఆమె సెలెక్ట్ చేస్తుంటారు అనే టాక్ కూడా ఉంది. అందుకు తగ్గట్టే ‘అఖండ’ నుండి బాలయ్య వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ‘అఖండ 2’ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరిస్తున్న తేజస్విని త్వరలో యాక్టర్ గా డెబ్యూ ఇవ్వబోతున్నట్లు కథనాలు వినిపించాయి. ఓ జ్యువెలరీ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ ఈమె డెబ్యూ ఇవ్వబోతుందని కూడా అంతా చెప్పుకొచ్చారు. మొత్తానికి ఆ యాడ్ ఇప్పుడు బయటకు వచ్చింది.
‘నా ఆత్మవిశ్వాసం,నా ఆనందం,నా ఉత్సాహం,నా అనుబంధం,నా సంతోషం, సిద్ధార్థ..! మన సంస్కృతి, సంప్రదాయాలు, మన ఆభరణాలు, సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్’ అంటూ తేజస్విని ఈ యాడ్లో చాలా ఉత్సాహంగా కనిపించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఎక్కడా నటిస్తున్నట్టు లేదు. చాలా ఇన్వాల్వ్ అయ్యి చేసినట్టు చేసింది. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసే విధానం కూడా బాగుంది. ఇక ఆటిట్యూడ్ విషయంలో తండ్రి బాలయ్యకి ఏమాత్రం తీసిపోదు. బహుశా నటన ఈమె బ్లడ్లోనే ఉందనుకోవాలి. ఈమె కనుక సినిమాల్లో నటించడానికి రెడీ అయితే.. వరలక్ష్మీ శరత్ కుమార్, రమ్యకృష్ణ(బాహుబలిలో శివగామి) వంటి వాళ్ళు చేసే పవర్ఫుల్ రోల్స్ కి కరెక్ట్ గా సెట్ అవుతుంది అని చెప్పాలి.