నెట్లో హల్ చల్ చేస్తున్న బాలయ్య నెక్స్ట్ మూవీ షూటింగ్ వీడియో!

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న సినిమా జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. గతవారం వరకు హైదరాబాద్ లో బాలయ్య, డ్యాన్సర్లపై ఒక పాట ను చిత్రీకరించారు. ఈ సాంగ్ పూర్తికాగానే రెస్ట్ తీసుకోకుండా తదుపరి షెడ్యూల్ ను పోర్చ్ గల్ లో ప్రారంభించారు.  40 రోజుల పాటు సాగె ఈ షెడ్యూల్ లో కొన్ని సీన్లు, మూడు పాటలతో పాటు ఓ భారీ ఫైట్ ని తెరకెక్కించనున్నారు. నిన్నటి నుంచి బాలకృష్ణ, శ్రియలపై ఓ పాటను డైరక్టర్ తెరకెక్కిస్తున్నారు.

ఆ పాట షూటింగ్ వీడియో ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తోంది. ఈ లీక్ నందమూరి అభిమానులను బాధ కలిగిస్తున్నప్పటికీ.. వీడియోలో బాలకృష్ణ లుక్ చూసి సంతోషపడుతున్నారు. పూరి జగన్నాథ్ బాలకృష్ణ ని చాలా స్టైల్ గా చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాట తర్వాత హెలికాఫ్టర్ తో కూడిన ఈ యాక్షన్ ఎపిసోడ్ ను హాలీవుడ్ నిపుణుల పర్వవేక్షన్లో షూట్ చేయనున్నట్లు తెలిసింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 29న రిలీజ్ కానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus