టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన అనిల్ రావిపూడి ఎఫ్3 సినిమా షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేశారు. వేగంగా సినిమాలను తెరకెక్కించడంతో పాటు తెరకెక్కించిన సినిమాలతో విజయాలను సొంతం చేసుకోవడం అనిల్ రావిపూడి ప్రత్యేకత అని చెప్పవచ్చు. వరుసగా ఐదు విజయాలను సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి ఎఫ్3 సినిమాతో డబుల్ హ్యాట్రిక్ సాధిస్తానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఎఫ్3 సినిమా విడుదలైన తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుంది.
బాలయ్య ఇప్పటికే అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ప్రస్తుతం అనిల్ రావిపూడి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే పటాస్ లో కళ్యాణ్ రామ్ ను పోలీస్ ఆఫీసర్ గా చూపించి హిట్ సాధించిన అనిల్ రావిపూడి బాలయ్యను కూడా పోలీస్ ఆఫీసర్ గా చూపించనున్నారని సమాచారం అందుతోంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా బాలయ్య ఈ సినిమాలో కనిపించనున్నారు. బాలయ్య గతంలో కొన్ని సినిమాలలో పోలీస్ ఆఫీసర్ గా నటించారు.
బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా తెరకెక్కిన సినిమాలలో కొన్ని సినిమాలు సక్సెస్ సాధిస్తే మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలిచాయి. అయితే బాలయ్య గత సినిమాలను మించి ఈ సినిమా ఉండబోతుందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ తో బాలయ్య బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే బాలయ్య అనిల్ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.
వరుసగా స్టార్ హీరోల సినిమాలకు డైరెక్టర్ గా వ్యవహరిస్తూ అనిల్ రావిపూడి తన రేంజ్ ను పెంచుకుంటున్నారు. ఇతర స్టార్ డైరెక్టర్లతో పోలిస్తే అనిల్ రావిపూడి పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?