Poorna: ఆ రీజన్ వల్లే బాలయ్యకు నో చెప్పారా..?

సాధారణంగా బాలకృష్ణ సినిమాలలో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు ఉన్నప్పటికీ హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదనే సంగతి తెలిసిందే. కొందరు దర్శకులు సైతం బాలకృష్ణను హైలెట్ చేసే సన్నివేశాలను తెరకెక్కించడానికి ప్రాధాన్యతనిస్తారే తప్ప హీరోయిన్ల పాత్రలను పెద్దగా పట్టించుకోరు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణకు జోడీగా ఈ సినిమాలో పూర్ణ, ప్రగ్య జైస్వాల్ నటిస్తున్నారు. ప్రగ్య జైస్వాల్ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా పూర్ణ సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

అయితే పూర్ణ పాత్రకు సంబంధించి వైరల్ అవుతున్న ఒక వార్త ఆమె ఫ్యాన్స్ ను తెగ టెన్షన్ పెడుతోంది. పూర్ణ ఈ సినిమాలో సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ లో కనిపిస్తారని ఆమె పాత్ర సినిమాలో కొన్ని నిమిషాలకే పరిమితమవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పూర్ణ పాత్ర నిడివి తక్కువగా ఉంటే అఖండ హిట్టైనా ఆ సినిమా పూర్ణ కెరీర్ కు ప్లస్ అయ్యే అవకాశం లేదు. అఖండ సినిమా కోసం దర్శకుడు బోయపాటి శ్రీను చాలామంది హీరోయిన్లను సంప్రదించినా ఎక్కువమంది హీరోయిన్లు బాలయ్యకు జోడీగా నటించడానికి నో చెప్పిన సంగతి తెలిసిందే.

అఖండ మూవీలో సెకండ్ హీరోయిన్ రోల్ కు ప్రాధాన్యత లేకపోవడం వల్లే హీరోయిన్లు బాలయ్యకు నో చెప్పి ఉండవచ్చని తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో సినిమా రిలీజ్ డేట్ మారనుంది. సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అఖండ సినిమాను రిలీజ్ చేసి సక్సెస్ ను సాధించాలని భావించిన బాలయ్య కరోనా సెకండ్ వేవ్ వల్ల రిలీజ్ డేట్ విషయంలో వెనక్కు తగ్గాల్సి వచ్చింది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus