Balayya Babu: బాలయ్య కోసం మాస్ స్టోరీ!

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ’ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు బాలయ్య. దీని తరువాత ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారు గోపీచంద్ మలినేని. ఈ సినిమాతో పాటు మరిన్ని సినిమాలు లైన్ లో పెడుతున్నారు బాలయ్య. అనీల్ రావిపూడితో బాలయ్య సినిమా ఉంటుందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.

స్క్రిప్ట్ కూడా రెడీగా ఉంది. కానీ ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియదు. దీంతో పాటు మైత్రి మూవీస్, దిల్ రాజు బ్యానర్లలో సినిమాలు చేయడానికి కమిట్మెంట్ ఇచ్చారు. రీసెంట్ గా హారిక హాసిని బ్యానర్ లో కూడా సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడొక తమిళ దర్శకుడు బాలయ్యతో సినిమా చేయాలనుకుంటున్నారట. కోలీవుడ్ లో మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఓ డైరెక్టర్.. బాలయ్య కోసం రంగంలోకి దిగుతున్నారు.

ప్రస్తుతం ఆయన కథ రెడీ చేస్తున్నారని.. అది సిద్ధం కాగానే బాలయ్యకు వినిపిస్తారని టాక్. ఈ మధ్యకాలంలో చాలా మంది కోలీవుడ్ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్యకి కూడా ఓ తమిళ డైరెక్టర్ దొరికినట్లు తెలుస్తోంది!

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus