బాలయ్య ఫాన్స్ కొత్త ట్రెండ్ ఇదే!!!

ఏం చేసినా…బాలయ్య ఫాన్స్ స్టైల్ ఏ వేరు అని మరో సారి నిరూపించారు బాలయ్య అభిమానులు, అప్పట్లో అమరావతి శంకుస్థాపనాకీ లక్ష ఇటుకులపై ‘జై బాలయ్య’ అని రాయించి, ఆ పేరునే నినాదంగా మార్చేసారు. ఇక నిన్న విడుదలయిన నాని ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ చిత్రాన్ని తమ భుజాలపై వేసుకుని మరీ హిట్ చేయించారు. విషయం ఏమిటంటే…నిన్న విడుదలయిన నాని ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. మరో పక్క ఈ చిత్రలో నాని చేతిపై జై బాలయ్య అనే టాటూ బాలయ్య అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మొదట్లో ఈ టాటూపై పెద్దగా ఆసక్తి కనబరచకపోయినా, ఈ టాటూ విషయం ఒక అభిమాని తీసిన ఫోటో ద్వారా సోషియల్ నెట్‌వర్కింగ్ సైట్స్ లో హల్‌చల్ చేస్తూ ఉండడం, మరో పక్క నిర్మాతలు సైతం ప్రమోషన్స్ లో భాగంగా నాని ఇంట్రొడక్షన్ సీన్ ను ప్రత్యేకంగా విడుదల చేయడం ద్వారా ఈ  టాటూ విషయం ఇండస్ట్రీలో టాక్ గా మారింది. ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న పిక్ లలో జై బాలయ్య టాటూ కూడా ఒకటి. ఆన్ లైన్ లోనే కాదు ఆఫ్ లైన్ లో కూడా జై బాలయ్య బాగానే సందడి చేస్తున్నాడు. సినిమా సక్సెస్ కావడంతో, నాని అభిమానులు, బాలయ్య అభిమానులు అందరూ ఈ టాటూ పై క్రేజ్ పెంచుకున్నారు. టామ్ చేతిపై జై బాలయ్య అన్న టాటూ  ని వేయించుకుని తమ అభిమాన నటుడిపై అభిమానాన్ని చాటుకున్నారు. చేతిపై ఈటాటూ వేయించుకుని ఫేస్ బుక్ పోస్ట్ చేయడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారడంతో, అందరూ ప్రత్యేకంగా ఫోటోస్ తీసి మరీ ఫేస్‌బుక్ లో పోస్ట్ చేస్తూ ఉండడం, బాలయ్యపై వారి అభిమాన్ని మరింత పెంచేలా కనిపిస్తుంది. ఏది  ఏమైనా..ఎవ్వరు ఎన్ని అనుకున్నా బాలయ్య  రేంజ్ వేరబ్బా.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus