ఘనంగా బండి సరోజ్ కుమార్ ‘పరాక్రమం’ సినిమా టీజర్ రిలీజ్

  • May 25, 2024 / 10:07 PM IST

బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా “పరాక్రమం”. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ‘పరాక్రమం’ సినిమా టీజర్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, దర్శకులు బుచ్చిబాబు, జ్ఞానసాగర్ ద్వారక, నిర్మాత ఎస్ కేఎన్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో

దర్శకుడు బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ – నేను 2004లో జూనియర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి వచ్చాను. చాలా మంది డైరెక్టర్స్ కు ఆడిషన్స్ ఇచ్చాను. వారికి నా యాక్టింగ్ అర్థం కాలేదు. నువ్వేంటి మాట్లాడినట్లు డైలాగ్స్ చెబుతున్నావ్ అనేవారు. నాకు ఇక్కడ సూట్ కాదని అర్థమైంది. నా యాక్టింగ్ తెలిసిన డైరెక్టర్ నేనే కావాలి అనుకుని దర్శకుడిగా మారాను. చిన్నప్పుడు టీవీలో చిరంజీవి గారిని చూశాకే నాకు సినిమా గురించి తెలిసింది. ఆ తర్వాత ఇళయరాజా, సిరివెన్నెల సీతారామశాస్త్రి, పీసీ శ్రీరామ్, శ్రీకర్ ప్రసాద్ ఇలాంటి వాళ్లంతా నన్ను ఇన్స్ పైర్ చేశారు. వీళ్లందరినీ స్ఫూర్తిగా తీసుకుని నాలోని సహజమైన ప్రతిభను మెరుగుపర్చుకుంటూ వచ్చాను. ఎందుకంటే నేను ప్రొడ్యూసర్స్ ను పట్టుకోవాలంటే అసాధారణ ప్రతిభావంతుడైన ఉండాలి. ఈ క్రమంలో ఒక 20 ఏళ్ల పాటు రెగ్యులర్ లైఫ్ కు దూరంగా ఉండిపోయా. నేను దర్శకుడిగా రెండు తమిళ చిత్రాలు, ఒక తెలుగు సినిమా చేశా. అవి మూడూ డిజాస్టర్స్ అయ్యాయి. నేనొక ఫెయిల్యూర్ డైరెక్టర్ నని తెలుసుకున్నా. అప్పుడు నేనే నటించాలని డిసైడ్ అయ్యి నిర్భందం, నిర్భందం 2, మాంగళ్యం సినిమాలు చేశాను. కల నాది వెల మీది కాన్సెప్ట్ లో యూట్యూబ్ లో ఆ సినిమాలను ఉంచాను. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి చాలా రెస్పాన్స్ వచ్చింది. వాళ్లకు తోచినంత డబ్బులు సపోర్ట్ చేశారు. నేను మెయిన్ స్ట్రీమ్ సినిమా చేయాలని, సకుటుంబంగా ఆ సినిమాలను చూడాలని నా సినిమాలను ఇష్టపడేవారు కోరుకున్నారు. వారందరి సపోర్ట్ తో ఎంకరేజ్ మెంట్ తో పరాక్రమం సినిమా చేశాను. నేను ఇండస్ట్రీలో ఎక్కువగా తిరగను. స్ట్రైట్ ఫార్వార్డ్ గా మాట్లాడతా కాబట్టి ఎక్కువమందికి నేను నచ్చను. నాకు ఇండస్ట్రీలో నచ్చిన ముగ్గురు వ్యక్తులు ఎస్ కేఎన్, బుచ్చిబాబు గారు, విశ్వక్ సేన్. ఈ ముగ్గురూ ఇవాళ మా టీజర్ రిలీజ్ కార్యక్రమానికి గెస్టులుగా రావడం సంతోషంగా ఉంది. ఎస్ కేఎన్ స్ట్రైట్ ఫార్వార్డ్, టాలెంటెడ్ ప్రొడ్యూసర్. ఆయన సినిమాల్లో టేస్ట్ తెలుస్తుంటుంది. బుచ్చిబాబు గారు ప్రూవ్డ్ డైరెక్టర్. మంచి మనసున్న వ్యక్తి. ఆయనను ఒకసారి కలిసినప్పుడు మీ మాంగళ్యం సినిమాకు నేను 5 వేలు పంపించాను అన్నారు. థ్యాంక్యూ సో మచ్. విశ్వక్ కూడా నాలాగే స్ట్రైట్ ఫార్వార్డ్ గా మాట్లాడతాడు. నటుడిగా నన్ను ఎవరితోనూ పోల్చకుండా నన్ను నన్నుగా చూస్తాడు. పరాక్రమం సినిమా కోసం ఒక యజ్ఞం చేశాం. ఇది ఇంపార్టెంట్ టైమ్ నాకు ఇలాంటి టైమ్ లో నాకు సపోర్ట్ గా వచ్చిన విశ్వక్ కు థ్యాంక్స్. నా గత చిత్రాలు కొన్ని సెక్షన్స్ ఆడియెన్స్ కే పరిమితం కానీ ఈ పరాక్రమం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేలా ఉంటుంది. అందుకే నా బ్యానర్ కు బీఎస్ కే మెయిన్ స్ట్రీమ్ అని పేరు పెట్టాను. అన్నారు.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ – నేను యానిమేషన్ ఎడిటింగ్ కోర్సులు చేస్తున్నప్పటి నుంచి మా సర్కిల్స్ లో బండి సరోజ్ కుమార్ పేరు వింటున్నా. ఆయన తమిళ్ లో పోర్కాళం అనే ఒక సినిమా చేశారు. ఆ సినిమా ఆడలేదు గానీ ఆ మూవీని బాగా ఇష్టపడే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఉన్నారు. కోవిడ్ టైమ్ లో బండి సరోజ్ కుమార్ నిర్భందం ట్రైలర్ చూసి ఆయనకు మెసేజ్ పంపాను. మీరు ఒక స్ట్రాంగ్ వాయిస్ వినిపించాలని అనుకుంటున్నారు. నాకు నచ్చింది అని చెప్పాను. సరోజ్ కుమార్ తనదైన ఒక మూవీ వరల్డ్ ను క్రియేట్ చేసుకున్నారు. కంటిన్యూస్ గా తనదైన తరహా సినిమాలు రూపొందిస్తున్నారు. ఆయనకు పరాక్రమం పెద్ద విజయాన్ని ఇవ్వాలి ఎందుకంటే ఆయన ఎదగాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకరిని. పరాక్రమం ట్రైలర్ చాలా బాగుంది. సరోజ్ కుమార్ డైరెక్టర్ కంటే నటుడిగా బాగా పర్ ఫార్మ్ చేస్తున్నాడు. ఆయన సినిమాకు టీమ్ అంటే ఆయనే. ఒక ఎనిమిది మంది పని బండి సరోజ్ కుమార్ చేస్తుంటాడు. ఆల్ ది బెస్ట్ అన్నా. అన్నారు.

దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ – ఈ సినిమాకు డీవోపీగా పనిచేసి ప్రసాద్ గారు 100 పర్సెంట్ లవ్ కు వర్క్ చేశారు. అప్పటినుంచి ఆయన నాకు పరిచయం. ప్రేమకథ, పౌర్ణమి సినిమాలకు అవార్డ్స్ అందుకున్న సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ గారు. ఈ ఒక్క క్రాఫ్ట్ నే బండి సరోజ్ కుమార్ మీకు వదిలేశాడని అనుకుంటా. ఉపేంద్ర గారు కన్నడలో అన్నీ మేజర్ క్రాఫ్ట్స్ ఆయనే చేసుకుంటారు. అలా తెలుగులో బండి సరోజ్ కుమార్ ఉన్నారు. డైరెక్షన్ ఒక్కటి చేయడమే కష్టమంటే మీరు ఇన్ని క్రాఫ్ట్స్ ఎలా చేస్తున్నారో ఆశ్చర్యంగా ఉంది. బండి సరోజ్ కుమార్ కల్ట్ మ్యాన్. ఆయన పోర్కాళం సినిమా నా ఫేవరేట్ మూవీ. పరాక్రమం సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక మాట్లాడుతూ – బండి సరోజ్ కుమార్ అన్న మూవీస్ టైటిల్స్ చాలా బాగుంటాయి. విశ్వక్ చెప్పినట్లు నటుడిగా సరోజ్ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటాడు. నిర్బంధం సినిమా చూసి నేను సర్ ప్రైజ్ అయ్యా. ఆయన పర్ ఫార్మెన్స్ చాలా జెన్యూన్ గా ఉంటుంది. క్యారెక్టర్ పట్ల ఎంతో నిజాయితీగా ఉంటే తప్ప అలా పర్ ఫార్మ్ చేయలేరు. సమాజానికి దూరంగా రుషిలా బతుకుతుంటారు ఆయన. బండి సరోజ్ కుమార్ కు పరాక్రమం సినిమా సూపర్ హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ – బండి సరోజ్ కుమార్ తో నాకున్నది చిన్న పరిచయమే. ఈ చిన్న పరిచయంలో ఆయన మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. సినిమా మీద ప్యాషన్ ఉన్న వ్యక్తి ఆయన. బండి సరోజ్ కుమార్ ఒక ఇంటర్వ్యూ చూసి ఆయన చెప్పిన సమాధానాలు వింటే ఎంతో జెన్యూన్ గా చెప్పాడనిపించింది. ఆయన ఏడెనిమిది క్రాఫ్టులు చేస్తున్నాడంటే అది ప్యాషన్, అవసరం, టాలెంట్ ఈ మూడు అనుకోవచ్చు. ఏదో నెంబర్ కోసం చేయాలని కాదు. పరాక్రమం సినిమా టీజర్ చూశాక ప్రతి ఫ్రేమ్ లో ఆయన హృదయంలోని ఫ్లేమ్ కనిపించింది. ఈ సినిమాతో బండి సరోజ్ కుమార్ కు మంచి గుర్తింపు రావాలి. ఆయనకు ఈ సినిమా రిలీజ్, ప్రమోషన్ విషయంలో ఎలాంటి సపోర్ట్ కావాలన్నా చేసేందుకు ముందుకొస్తాను. చిన్న సినిమాల ఎగ్జిబిషన్ విషయంలో నిర్మాతల మండలికి నాదొక చిన్న సూచన. రెండు మూడో వారం నుంచే చిన్న సినిమాలు పికప్ అవుతాయి కాబట్టి అప్పుడు వచ్చే కలెక్షన్స్ షేర్ లో డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ కు ఎక్కువ వాటా ఇవ్వాలని కోరుతున్నా. అన్నారు.

నటుడు మోహన్ మాట్లాడుతూ సేనాపతి మాట్లాడుతూ – నా ఫ్రాంక్ నెస్ నచ్చి పరాక్రమం సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు బండి సరోజ్ కుమార్ గారు. ఆయన ఆ తర్వాత మంచి మిత్రుడిగా మారారు. ఈ సినిమా మా అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా. అన్నారు

నటుడు శశాంక్ వెన్నెలకంటి మాట్లాడుతూ – బండి సరోజ్ కుమార్ గతంలో ఫేస్ బుక్ ద్వారా నన్ను అప్రోచ్ అయ్యారు. ఆయన నాలోని నటుడిని చూశారు. తన సినిమాలో క్యారెక్టర్ ఇస్తా అన్నారు. అది కోవిడ్ టైమ్. నేను ఆ సినిమా చేయలేకపోయాను. ఆ తర్వాత మాంగళ్యం మూవీకి సాంగ్స్ రాయమని అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఈ పరాక్రమ తో నటుడిగా, దర్శకుడిగా బండి సరోజ్ కుమార్ పరాక్రమంతో మరింత మంది ఆడియెన్స్ కు రీచ్ అవుతారని ఆశిస్తున్నా. అన్నారు.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus