Bandla Ganesh: పవన్ పై మళ్లీ అభిమానం చాటుకున్న బండ్లన్న!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నప్పటికీ ఆ అభిమానులలో బండ్ల గణేష్ ప్రత్యేకం అనే విషయం తెలిసిందే. బండ్ల గణేష్ స్పీచ్ కోసమే పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్లకు వచ్చే అభిమానులు కూడా భారీస్థాయిలో ఉన్నారు. భీమ్లా నాయక్ ఈవెంట్ కు బండ్ల గణేష్ హాజరు కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ఈవెంట్ కు హాజరు కాకపోవడం గమనార్హం. అయితే భీమ్లా నాయక్ రిలీజ్ సందర్భంగా బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు.

Click Here To Watch

బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మా దేవర నటించిన భీమ్లా నాయక్ సినిమా దెబ్బకు బాక్సులు బద్దలవ్వాలని రికార్డులు చిరిగిపోవాలని కోరుకుంటున్నానని బండ్ల గణేష్ పేర్కొన్నారు. భీమ్లా నాయక్ సినిమాకు దిక్కులు పిక్కటిల్లేలా ఫ్యాన్స్ స్వాగతం పలకాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. చరిత్ర కోసం మీరు కాదు.. మీ కోసం చరిత్ర దేవర అంటూ బండ్ల చేసిన ట్వీట్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.

బండ్ల గణేష్ మరో ట్వీట్ లో మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్ మై గాడ్ ఈజ్ పవన్ కళ్యాణ్ అంటూ చెప్పుకొచ్చారు. బండ్ల గణేష్ చేసిన ట్వీట్లను పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. భీమ్లా నాయక్ కలెక్షన్ల విషయంలో రికార్డులు సృష్టిస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. హరీష్ శంకర్ ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ కొంచెం గ్యాప్ తర్వాత గర్జించే పవన్ ను చూశానని చెప్పుకొచ్చారు.

సాగర్ కె చంద్ర, త్రివిక్రమ్ పనితీరు అద్భుతమని హరీష్ శంకర్ కామెంట్లు చేశారు. నాగవంశీ టీమ్ కు శుభాకాంక్షలు.. థమన్ బావ గురించి ప్రత్యేకంగా చెప్పాలని థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ భీమ్లా నాయక్ కు బ్యాక్ బోన్ అని ఆయన అన్నారు. తాను డానియల్ శేఖర్ ను మాత్రమే చూశానని రానాను చూడలేదని హరీష్ శంకర్ పేర్కొన్నారు. భీమ్లా నాయక్ కు పాజిటివ్ టాక్ రావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.

భీమ్లా నాయక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus