బండ్ల గణేష్ ఈ మధ్యనే వైరస్ మహమ్మారి భారిన పడి.. అదృష్ట వశాత్తు కొద్దిరోజుల్లోనే కోలుకున్నాడు.ఇదిలా ఉండగా.. ఈయన ఏం కామెంట్ చేసినా.. అది పెద్ద దుమారాన్నే రేపుతుంటుంది. ఏదైనా మాట అనే ముందు అస్సలు ఆలోచించడు. మనసులో ఏదుంటే అదే అనేస్తుంటాడు. దాంతో నవ్వుల పాలవుతుంటాడు. వాటికి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో దర్శకుడు హరీష్ శంకర్ పై విమర్శలు చేసి బుక్కైన బండ్ల గణేష్.. ‘టాక్ ఆఫ్ ది టౌన్’ అవుతూ వచ్చాడు.
సరే అదంతా అయిపోయింది. అయితే ఇటీవల కూడా కొన్ని కామెంట్లు చేసి అడ్డంగా బుక్కైపోయాడు మన బండ్లన్న. నిర్మాతగా స్టార్ హీరోలతో సినిమాలు చేసి చేతులు కాల్చుకున్న బండ్ల గణేష్ మళ్ళీ ఆ దిశగా ప్రయత్నాలు చెయ్యకూడదు అని అప్పుడు డిసైడ్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. కానీ ఈ మధ్యన మళ్ళీ సినిమాలు నిర్మిస్తానని పదే పదే చెప్పుకొస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చెయ్యాలని ఉంది అని ఇటీవల ఆయన పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అందులో తప్పేమీ లేదు.. కానీ ‘అతని కొడుకుని హీరోగానే పరిచయం చెయ్యాలని ఉంది’ అని బండ్లన్న చేసిన కామెంట్సే ఇప్పుడతన్ని వార్తల్లో నిలబెట్టాయి.
నిజానికి అతని కొడుకుని హీరోని చెయ్యాలనుంది అని తన మనసులో మాట చెప్పడంలో కూడా తప్పేమీ లేదు. అతని కొడుకుకి నటన పై ఆసక్తి.. ప్రేక్షకులను ఆకర్షించే ట్యాలెంట్ ఉంటే కచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ కామెంట్స్ చేసింది బండ్ల గణేష్ కాబట్టి నెటిజెన్లు ఇతన్ని విమర్శించడం మొదలుపెట్టారు. ‘కొడుకుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తే చూసెయ్యడానికి.. జనాలు ఎగబడిపోయే రోజులు కావు ఇవి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Most Recommended Video
ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!