కృతజ్ఞత అనేది నా బ్లడ్ లోనే ఉంది : బండ్ల గణేష్

బండ్ల గణేష్ ఏం మాట్లాడినా ఒక సెన్సేషనే..! ఏం ట్వీట్ వేసినా ఒక సెన్సేషనే..! ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన రియాక్ట్ అయ్యే తీరు పవన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అదే సాధారణ ప్రేక్షకులను కూడా విసిగిస్తుంది అనడంలో సందేహం లేదు. అసలు మేటర్ ఏంటంటే.. జి.హెచ్.‌ఎం.సి ఎలక్షన్ల నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రకాష్‌ రాజ్‌.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ని ‘ఊసరవెల్లి’ అంటూ కామెంట్ చేసాడు. ఈ కామెంట్ కు బండ్ల గణేష్‌ సోషల్ మీడియాలో పరోక్షంగా ప్రకాష్ రాజ్ గురించి స్పందించాడు.

బండ్ల గణేష్ తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ…”ఎలక్షన్ టైంలో మాట్లాడటం ధర్మం కాదని రాజకీయాలు మాట్లాడకూడదని నేనేం మాట్లాడలేదు. నేను ఒకటి మాత్రం చెప్తున్నా..నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు కానీ పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం ఆయన వ్యక్తిత్వం ఆయన నిజాయితీ ఆయన నిబద్ధత నాకు తెలుసు..! పవన్ కళ్యాణ్ మహోన్నతమైన వ్యక్తి రాజకీయాలు ఎవరైనా చేసుకోవచ్చు రాజకీయాలు ఎవరైనా మాట్లాడుకోవచ్చు కాని వ్యక్తిత్వం గురించి పవన్ కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడినా నేను సహించను పవన్ కళ్యాణ్ నా దృష్టిలో నాకు ఎప్పటికీ దైవంతో సమానం..

ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు ఎంతో మంది సాంకేతిక నిపుణులు ఎంతోమంది నిర్మాతల్ని పరిచయం చేసిన ఘనత మా దైవం పవన్ కళ్యాణ్…నిజాయితీకి నిలువుటద్దం పవన్ కళ్యాణ్..నాకు కృతజ్ఞత అనేది నా రక్తంలో ఉంది..నేను ఈరోజు అనుభవిస్తున్న ఈ స్థాయి నాకు పవన్ కళ్యాణ్ పెట్టిన బిక్ష..” అంటూ బండ్ల గణేష్‌ వరుస ట్వీట్స్‌ చేశారు. ఇవి పరోక్షంగా ప్రకాష్ రాజ్ పై కౌంటర్లు కూడా అని కొంతమంది కామెంట్లు పెడుతుండడం గమనార్హం.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus