Bandla Ganesh: టీవీ ఛానల్ ఏర్పాటుపై ఓపెన్ కామెంట్స్ చేసిన బండ్ల గణేష్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బండ్ల గణేష్ అనంతరం నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించి నిర్మాతగా కూడా గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఈయన ఎలాంటి సినిమాలను నిర్మించకపోయిన సినిమాలకు సంబంధించిన పలు విషయాల గురించి ప్రస్తావిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ చేసిన, లేదా ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన చేసే కామెంట్లు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయి.

ఇదిలా ఉండగా తాగారా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి బండ్ల గణేష్ కు ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి అయితే ఈ వార్తలు విన్నటువంటి బండ్ల గణేష్ ఏకంగా యాంకర్ పై పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. గతంలో బండ్ల గణేష్ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేస్తానని చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా యాంకర్ కొత్త ఛానల్ ఏర్పాటు గురించి ప్రశ్నించారు.త్వరలోనే ఛానల్ ప్రారంభిస్తున్నారు కదా అంటూ ప్రశ్నించగా ఈ ప్రశ్నకు బండ్ల గణేష్ సమాధానం చెబుతూ..

డబ్బు వచ్చే చోటే వ్యాపారం చేయాలని ఆలోచించడంలో తప్పేముంది అంటూ సమాధానం చెప్పారు.అంటే న్యూస్ ఛానల్లో అంత లాభాలు వస్తున్నాయని అంటూ యాంకర్ ప్రశ్నించగా మరి మీరంతా అడుక్కుతింటున్నారా అంటూ ఈయన ఓ రెంజ్ లో ఫైర్ అయ్యారు. బండ్ల గణేష్ గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఫైర్ అవుతూ చేసినటువంటి ఒక ఆడియో లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన బండ్ల గణేష్ ఆ వాయిస్ తనదేనని బహిరంగంగా ఒప్పుకున్నారు.

అలాగే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నుబెదిరించినట్టు వార్తలు రావడంతో లైవ్ లోనే ఈయన మంత్రి అనిల్ కుమార్ కి ఫోన్ చేసి ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి బండ్ల గణేష్ పాల్గొన్నటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus