రీసెంట్ గా కోలీవుడ్ లో విడుదలైన ‘మండేలా’ సినిమా చర్చనీయాంశంగా మారింది. కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను అశ్విన్ అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. రెండు కులాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న ఓ ఊరిలో పంచాయితీ ఎలెక్షన్స్ కు రంగం సిద్ధం కావడం, ఇరు కులాల ఓట్లు సమానంగా ఉండి.. ఆ ఊరు వాళ్లంతా తక్కువగా చూసే ఓ బార్బర్ ఓటు కీలకంగా మారుతుంది. ఇలాంటి కథను ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించారు.
రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఏమైనా చేస్తారనే విషయాన్ని సెటైరికల్ గా చూపించాడు దర్శకుడు. వినోదం పంచుతూనే మంచి సందేశాన్ని అందించే సినిమా ఇది. ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత అనీల్ సుంకర ‘మండేలా’ రీమేక్ రైట్స్ తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ముందుగా బండ్ల గణేష్ రీమేక్ హక్కుల కోసం ప్రయత్నించారని..
ఆయనే లీడ్ రోల్ లో చేయాలనుకున్నారని.. కానీ ఆయన స్థానంలో మరో కమెడియన్ వచ్చాడని ప్రచారం నడుస్తోంది. దీనిపై ట్విట్టర్ లో స్పందించిన బండ్ల గణేష్ ”ఒప్పుకుంటే కదా తప్పుకోవడానికి” అంటూ కామెంట్స్ చేశాడు. అంటే ఈ సినిమా రేసులో తాను ఎప్పుడూలేనని చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు ఈ రీమేక్ లో సునీల్ నటిస్తున్నాడని టాక్!
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!