Bandla Ganesh: బండ్ల గణేష్ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించడం ఖాయమేనా?

టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గత కొంతకాలంగా సినిమాల నిర్మాణానికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ తో టెంపర్ సినిమాను నిర్మించి కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను సొంతం చేసుకున్న బండ్ల గణేష్ ఈ సినిమా తర్వాత సినిమాల నిర్మాణానికి దూరంగా ఉన్నారు. గతంలో రాజకీయాల్లోకి వచ్చి ఓటమిపాలైన బండ్ల గణేష్ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. తాజాగా రాజకీయాలకు సంబంధించి బండ్ల గణేష్ సంచలన ప్రకటన చేయగా ఆ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాజకీయాలంటే నీతి అని రాజకీయాలంటే నిజాయితీ అని రాజకీయాలంటే పౌరుషమని రాజకీయాలంటే కష్టమని రాజకీయాలంటే పోరాటం అని రాజకీయాలంటే శ్రమ అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి రావాలని రాజకీయాల్లో చేరాలని అందుకే వస్తానని బండ్ల గణేష్ అన్నారు. బండ్ల గణేష్ ఈ ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేస్తారో చూడాల్సి ఉంది. రాజకీయ పునఃప్రవేశంపై బండ్ల గణేష్ చేసిన ప్రకటన గురించి సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ వస్తున్నాయి.

గత ఎన్నికల సమయంలో (Bandla Ganesh) బండ్ల గణేష్ చేసిన కామెంట్ల వల్ల ఆయనపై మళ్లీ ట్రోల్స్ వస్తున్నాయి. అయితే రాజకీయాల్లో ఈసారి కచ్చితంగా సంచలనాలు సృష్టించాలని బండ్ల గణేష్ ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది. బండ్ల గణేష్ పొలిటికల్ ప్లాన్స్ కు సంబంధించి త్వరలో పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

గతంలో చాలా సందర్భాల్లో రాజకీయాలకు దూరమని బండ్ల గణేష్ వెల్లడించారు. బండ్ల గణేష్ రాబోయే రోజుల్లో ఒకవైపు రాజకీయాల్లో కెరీర్ ను కొనసాగిస్తూనే సినిమాలతో బిజీ అవుతారో లేక కెరీర్ పరంగా మరో విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది. బండ్ల గణేష్ రాజకీయాల్లో సక్సెస్ కావాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus