Bandla Ganesh: బండ్ల ట్వీట్ కు పొంగిపోతున్న తారక్ ఫ్యాన్స్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. శ్రీనువైట్ల దర్శకత్వంలో ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా బండ్ల గణేష్ నిర్మాణంలో తెరకెక్కిన బాద్ షా సినిమా విడుదలై నేటికి 8 సంవత్సరాలైంది. బృందావనం తరువాత సరైన హిట్ లేక కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న ఎన్టీఆర్ కు బాద్ షా రూపంలో సూపర్ హిట్ దక్కింది. డీసెంట్ కలెక్షన్లను సాధించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ప్రశంసలు దక్కాయి.

బ్రహ్మానందం కామెడీ కూడా ఈ సినిమా సూపర్ హిట్ కావడానికి ఒక కారణమని చెప్పవచ్చు. సినిమా విడుదలై ఎనిమిది సంవత్సరాలైన సందర్భంగా బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా “ఎన్టీఆర్ ను కొనగలిగే మగాడు లేదు, ఇక ముందు రాడు” అంటూ బాద్ షా సినిమాలోని డైలాగ్ ను పోస్ట్ చేశారు. 60 కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా 5 కేంద్రాలలో 100 రోజులు పూర్తి చేసుకుంది. బాద్ షా సక్సెస్ తరువాత శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఏ సినిమా కూడా ఆ సినిమా స్థాయిలో హిట్ కాలేదు.

ఈ సినిమా కోసం పని చేసిన కోన వెంకట్ బాద్ షా సినిమాకు పని చేసినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానని.. ఈ సినిమాకు తారక్ సూపర్ పర్ఫామెన్స్ ఇచ్చారని ట్విట్టర్ ద్వారా తెలిపారు. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ రన్ లో దాదాపు 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది. హీరో సిద్దార్థ్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించారు. బండ్ల గణేష్ ఎన్టీఆర్ ను ప్రశంసిస్తూ చేసిన ట్వీట్ కు తారక్ ఫ్యాన్స్ పొంగిపోతున్నారు.


Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus