Bandla Ganesh, Puri Jagannadh: ఫ్రెండ్ అంటూనే మరోసారి పూరి భార్య బిడ్డల ప్రస్తావన తెస్తూ రెచ్చిపోయిన బండ్ల గణేష్?

బండ్ల గణేష్ ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా,లేదా సోషల్ మీడియా వేదికగా ఈయన ఎలాంటి ట్వీట్ చేసిన ఆ ట్వీట్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఎన్నో వివాదాలకు కారణం అవుతుంది. ఈ విధంగా బండ్ల గణేష్ ఇదివరకు ఎన్నో వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచిన విషయం మనకు తెలిసిందే.ఇకపోతే గతంలో పూరి జగన్నాథ్ కుమారుడు నటించిన చోర్ బజార్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పాల్గొన్నటువంటి బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఒకవైపు పూరి జగన్నాథ్ భార్య బిడ్డలను పొగుడుతూనే పూరి జగన్నాథ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇక్కడ కొడుకు సినిమా వేడుక జరుగుతుంటే పూరీ జగన్నాథ్ ముంబైలో కూర్చుని ఏం చేస్తున్నావు.. మన జీవితంలో ఎన్నో వ్యాంపులు రాంపులు వస్తుంటాయి పోతుంటాయి అంటూ ఈయన చేసిన కామెంట్స్ ఎన్నో చర్చలకు దారితీసాయి. అయితే బండ్ల గణేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై పూరి జగన్నాథ్ స్పందిస్తూ నాలుక అదుపులో పెట్టుకొని మాట్లాడటం ఎంతో మంచిది అంటూ పరోక్షంగా కౌంటర్ వేశారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి బండ్ల గణేష్ మరోసారి పూరి జగన్నాథ్ తన ఫ్రెండ్ అంటూనే తన భార్య బిడ్డల గురించి ప్రస్తావన తీసుకువస్తూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు యాంకర్ ప్రశ్నిస్తూ పూరి జగన్నాథ్ నాలుక అదుపులో పెట్టుకో అన్నారు ఏ ఉద్దేశంతో అన్నారు అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు బండ్ల గణేష్ సమాధానం చెబుతూ భార్య బిడ్డలను ప్రేమించనీవాడు మనిషా అన్నా అనగానే ఈ ప్రోమో కట్ చేశారు.ప్రేమించడం ప్రేమించకపోవడం ఆయన ఇష్టం అంటూ యాంకర్ అనగా పూరి జగన్నాథ్ కు మంచి చెడు చెప్పే రైట్స్ నాకు ఉన్నాయి పూరి నా ఫ్రెండ్ ఫోన్ పెట్టు అంటూనే మరోసారి పూరి జగన్నాథ్ గురించి బండ్ల గణేష్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై పూరి స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus