బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన జై లవకుశని చూసిన ప్రతి ఒక్కరూ అదుర్స్ అంటున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రం ఆరు రోజుల్లో వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇందులో ఎన్టీఆర్ మూడు క్యారెక్టర్లో నటన చూసి దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సైతం మాటలు రావడం లేదని అభినందించారు. తాజాగా నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్రంపై సంచలనం కామెంట్స్ చేశారు. “జై లవ కుశ సినిమా రాత్రి చూసా నిద్ర పట్టలేదు! ఎన్.టి.ఆర్, ఎన్.వి.ఆర్(ఎస్ వీఆర్) , తరవాత తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జూ ఎన్టీఆర్ ఆ స్థాయిలో అద్భుతంగా నటించిన మా బాద్ షాకి హ్రుదయపూర్వక ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశారు.
దీంతో నందమూరి అభిమానులు చాలా సంతోషపడుతున్నారు. ఈ ట్వీట్ కి లైకులు కొడుతున్నారు. గతంలో గణేష్ ఎన్టీఆర్ తో బాద్షా మూవీ తీశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ వచ్చి దూరం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పోయి టెంపర్ నిర్మించారు. ఇది ఎన్టీఆర్ కెరీర్ ని హిట్ ట్రాక్ లోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి తారక్ విజయ పరంపరను కొనసాగిస్తున్నారు. అందుకే వీరి కాంబినేషన్లో మూడో మూవీ ఎప్పుడు మొదలవుతుందా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.