Teen Maar: 12 ఏళ్ళ ‘తీన్ మార్’ మూవీ పై నిర్మాత బండ్ల గణేష్ ఓల్డ్ కామెంట్స్ వైరల్..!

పవన్ కళ్యాణ్ డ్యూయల్ రోల్ పోషించిన ‘తీన్ మార్’ చిత్రం రిలీజ్ అయ్యి నేటితో 12 ఏళ్ళు పూర్తి కావస్తోంది. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాత. 2011 వ సంవత్సరం ఏప్రిల్ 14న రిలీజ్ అయిన ఈ చిత్రం.. బాలీవుడ్లో తెరకెక్కిన ‘లవ్ ఆజ్ కల్’ కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. నిజానికి ఇది హిట్టు సినిమా ఏమీ కాదు. కానీ ‘సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా ఇది’ అని అంతా అంటుంటారు.

మరీ ముఖ్యంగా నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుంది అని మొదట చాలా అంచనాలు పెట్టుకున్నాడు. కానీ అతని ఆశలపై ఈ మూవీ నీళ్లు జల్లినట్టైంది. ‘తీన్ మార్’ చిత్రానికి త్రివిక్రమ్ .. కథ, మాటలు అందించడం జరిగింది. ఈ సినిమాకి త్రివిక్రమ్ చాలా అద్భుతమైన డైలాగులు రాశాడు. కానీ సింక్ సౌండ్ సిస్టమ్ ను ఫాలో అవ్వడంతో.. ఆ డైలాగులు చాలా మందికి అర్థం కాలేదు. అలాగే క్లైమాక్స్ అయితే అప్పటివరకు నెగిటివ్ ఒపీనియన్ తో ఉన్న ప్రేక్షకుల ఆలోచనలను మార్చేస్తుంది.

‘ఈ సినిమాని (Teen Maar) కనుక త్రివిక్రమ్ డైరెక్ట్ చేసి ఉండుంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యుండేది’ అని బండ్ల గణేష్ దివంగత టిఎన్నార్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘ఈ సినిమా రిలీజ్ అయ్యాక పవన్ కళ్యాణ్ విదేశాలకు వెళ్లారు. ఆయన తిరిగి వచ్చాక ‘ఎలా ఉంది టాక్’ అని అడిగితే మానమనుకున్నంత లేదు బాబు’ అంటూ బండ్ల గణేష్ చెప్పారట.

దీంతో పవన్ కళ్యాణ్..సొంతంగా నిర్మించాలి అనుకున్న ‘గబ్బర్ సింగ్’ ప్రాజెక్ట్ ను బండ్ల గణేష్ నే నిర్మించమని.. అతని చేతిలో పెట్టాడట పవన్ కళ్యాణ్. అలా ‘తీన్ మార్’ మిగిల్చిన నష్టాలు ‘గబ్బర్ సింగ్’ తీర్చినట్టు కూడా బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు. ‘తీన్ మార్’ చిత్రానికి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ గా నిలిచిందని చెప్పొచ్చు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus