Bandla Ganesh: బండ్ల గణేష్ సెటైరికల్ ట్వీట్… ఆ దర్శకుడిని టార్గెట్ చేశాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా గుర్తింపు పొందిన బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా తన సినీ ప్రయాణం మొదలుపెట్టిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారి గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరించాడు. అయితే నిర్మాణ రంగంలో బండ్ల గణేష్ సక్సెస్ కాలేకపోవడంతో ఆ రంగానికి దూరంగా ఉంటూ నటుడిగా మళ్లీ తన ప్రయాణం కొనసాగిస్తున్నాడు.

బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటున్నాడు. తత్వవేత్తగా మారిపోయి జీవిత సత్యాలు బోధిస్తున్నారు. అలాగే కొన్ని సందర్భాలలో డైరెక్టర్లను టార్గెట్ చేస్తూ కూడా ట్వీట్లు వదులుతుంటారు. దీంతో ఇటీవల బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. “మోసం చేయాలనుకునేవారు మేధావిలా నటిస్తాడు. వంచించాలనుకునేవాడు గురువులా నటిస్తాడు. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ భక్తుడిగానే పొగరుగా ఉంటాడు. అది మీకు నచ్చినా నచ్చకపోయినా’’ అంటూ ట్వీట్ చేశారు.

ఇలా బండ్ల డైరెక్టర్ త్రివిక్రమ్ ను ఉద్దేశించి బండ్ల గణేష్ ఈ ట్వీట్ చేసినట్లు భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో భీమ్లా నాయక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో బండ్ల గణేష్ కి త్రివిక్రమ్ అడ్డు చెప్పినట్లు వార్తలు వినిపించాయి. అంతేకాకుండా ఆ సమయంలో బండ్ల గణేష్ కి సంబంధించిన ఒక ఆడియో కూడా లీక్ అయింది. దీంతో అప్పటినుండి బండ్ల గణేష్ త్రివిక్రమ్ మధ్య గ్యాప్ వచ్చింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ కి మధ్య ఉన్న సంబంధాలు కూడా తెగిపోయినట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కి భక్తుడైతే, బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కి భక్తుడు. అందువల్ల త్రివిక్రమ్ కోసం పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ ని దూరం పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో బండ్ల గణేష్ కూడా త్రివిక్రమ్ పట్ల అసహనంగానే ఉన్నాడని తెలుస్తోంది. దీంతో బండ్ల గణేష్ చేసిన ట్వీట్ త్రివిక్రమ్ ని ఉద్దేశించే ట్వీట్ చేశారని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరి నిజంగానే బండ్ల గణేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ని టార్గెట్ చేశారా? లేక ఇలా ట్వీట్ చేయటానికి వేరే కారణం ఏదైనా ఉందా? అనేది తెలియదు గానీ ప్రస్తుతం బండ్ల గణేష్ ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus