ఇలాంటివి గుర్తు చేసినందుకు విజయ్ కి థాంక్స్.. బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ తక్కువ సినిమాలతోనే స్టార్ హోదా పొందిన హీరోల్లో ఒకరిగా చెప్పవచ్చు. విజయ్ దేవరకొండ టాలీవుడ్ ఇండస్ట్రీకి అర్జున్ రెడ్డి సినిమా ద్వారా పరిచయం అయ్యి గీతగోవిందం, టాక్సీవాలా, లైగర్ వంటి విజయవంతమైన సినిమాలతో యువతరంలో ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్నారు. విజయ్ దేవరకొండ ఖుషి సినిమా షూటింగ్లో బిజీగా ఉంటున్న విషయం తెలిసింది. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది.

ఇదిలా ఉండగా హీరో విజయ్ దేవరకొండ నిన్న తన తండ్రితో ఇంటి మేడ పై కూర్చొని ఉన్న ఫోటోను సోషల్ ద్వారా ప్రేక్షకులతో పంచుకోవడం జరిగింది. ఈ ఫోటోలో విజయ్ దేవరకొండ తన తండ్రినీ ఆ గౌరవించే విధంగా కాలు చాపి మరి కూర్చోవడంతో ఈ ఫోటోను చూసిన కొందరు నెటిజన్లు పెద్దవారికి నువ్వు ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తుంటే మరి కొందరు విజయ్ దేవరకొండ తన తండ్రితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఫోటో పై నిర్మాత బండ్ల గణేష్ స్పందిస్తూ బండ్ల గణేష్ లాక్ డౌన్ సమయంలో తన తండ్రికి తనే స్వయంగా హెయిర్ కటింగ్ చేస్తూ తన తండ్రికి సేవ చేస్తున్న ఫోటోను ప్రేక్షకులతో పంచుకోవడంతో పాటు మనకి ఈ ప్రపంచాన్ని చూసే అదృష్టాన్ని కల్పించిన మన తల్లిదండ్రులు మన దైవాలు వారిని ప్రేమించటం పూజించటం మన ధర్మం అంటూ క్యాప్షన్ రాసి పోస్ట్ చేయడంతో హీరో దేవరకొండకు కౌంటర్ ఇచ్చినట్లు అయింది.

ఈ ఫోటోల వివాదంపై కొందరు నేటిజెన్లు స్పందిస్తూ ఎవరి ఇష్టం వారిది దీనిని అనవసరంగా కాంట్రవర్సీ చేస్తున్నారంటూ స్పందించడంతో బండ్ల గణేష్ మళ్లీ అదే ఫోటో పై స్పందిస్తూ నాకు ఇలాంటి ఫోటోను గుర్తు చేసినందుకు విజయ్ దేవరకొండకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ వివరణ ఇవ్వడంతో వీరిద్దరి మధ్య సాగే ఆసక్తికర చర్చ మరింత వైరల్ గా మారింది. తదుపరి ఈ ఫోటోపై విజయ్ దేవరకొండ ఎలాంటి క్లారిటీ ఇస్తాడో వేచి చూడాలి మరి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus