బండ్ల గణేష్, హరీష్ శంకర్ ల గొడవ పెద్దదయ్యేలా ఉందే…!

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రంతో లైమ్ లైట్ లోకి వచ్చారు దర్శకుడు హరీష్ శంకర్ అలాగే నిర్మాత బండ్ల గణేష్. 10 ఏళ్ళుగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ మరియు అతని అభిమానులకి ఈ సినిమా సంతృప్తిని ఇచ్చింది. ఈ చిత్రం క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ.. ఇన్నీ.. కాదు. అందుకే ఈ చిత్రం వచ్చి 8 ఏళ్ళు పూర్తయిన తరుణంలో ట్విట్టర్ లో అభిమానులు భారీ ఎత్తున ట్రెండ్ చేశారు అభిమానులు.

అంతా బానే ఉంది కానీ.. మధ్యలో నిర్మాత బండ్ల గణేష్ అలాగే దర్శకుడు హరీష్ శంకర్ ల కోల్డ్ వార్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కోల్డ్ వార్ కాదు డైరెక్ట్ గా వార్ కే తెరలేపినట్టు బండ్ల కామెంట్స్ ఉన్నాయి. ఇటీవల బండ్ల గణేష్… దర్శకుడు హరీష్ శంకర్ ను ఉద్దేశిస్తూ.. ‘రీమేక్ లేకుండా ఒక్క హిట్టు కొడితే.. నేను ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతానంటూ కామెంట్స్ చేసాడు. అక్కడైతే ఆగలేదు.. ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి ముందు హరీష్ డిప్రెషన్ లో ఉన్నాడు.. ఆ టైములో అతన్ని పవన్ కళ్యాణ్ కు పరిచయం చేసి.. సినిమా చేసే అవకాశం ఇచ్చాను’ అంటూ బండ్ల గణేష్ కామెంట్ చేసాడు.

ఇక హరీష్ గబ్బర్ సింగ్ చిత్రం 8 ఏళ్ళు పూర్తిచేసుకున్న తరుణంలో స్క్రిప్ట్ రైటర్స్ కు అలాగే పవన్ అభిమానులకు థాంక్స్ చెప్పాడు కానీ బండ్ల గణేష్ పేరుని ప్రస్తావించలేదు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.. ‘గబ్బర్ సింగ్’ ‘గద్దల కొండ’ గణేష్ చిత్రాలను మాత్రమే హరీష్ రీమేక్ చేసాడు. ‘మిరపకాయ్’ వంటి ఓ సూపర్ హిట్, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి ఎబౌవ్ యావరేజ్.. ‘దువ్వాడ జగన్నాథం’ వంటి యావరేజ్.. సినిమాలతో అతని ట్రాక్ రికార్డు ఉంది. అవి కూడా రీమేక్ లు కాదు. బండ్ల గణేష్ ఈ లాజిక్ ఎలా మిస్సయ్యాడు.. అని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus